ఆర్మీలో నో.. ‘గే సెక్స్’

Submitted on 10 January 2019
Indian Army will not allow gay $ex, says Bipin Rawat

భారత ఆర్మీలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీకి అంటూ సొంత నియమ, నిబంధనలు ఉన్నాయని అన్నారు. ఇటీవల దేశంలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ప్రశ్నకు సమాధానంగా రావత్ పై విధంగా వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం చారిత్రక తీర్పు వెల్లడిస్తే.. జనరల్ రావత్ మాత్రం భారత ఆర్మీలో అది నేరమని వ్యాఖ్యానించారు. ‘‘భారత ఆర్మీ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సరిహద్దుపై ఉండే సైనికుడు ఎన్నడూ కూడా కుటుంబం కోసం తిరిగి వెళ్లాలనుకోడు. అలాగే ఇక్కడ ఎల్జీబీటీ సమస్య ఉండనే ఉండదు. ఆర్మీ వీటిని ఎంతమాత్రం అంగీకరించదు’’ అని రావత్ అభిప్రాయపడ్డారు.

సైనికుల్లో ఎల్జీబీటీ కార్యకలాపాలను ఆర్మీ ఎన్నటికీ అనుమతించదు. ఇలాంటి వాటిని డీల్ చేసేందుకు ఆర్మీలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని రావత్ చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన నేపథ్యంలో సమాజంలో వచ్చే మార్పులపై భారత ఆర్మీ గమనిస్తూనే ఉంటుందని, లెట్స్ వెయిట్.. వాచ్ అన్నారు. అప్పట్లో జవాన్లు సోషల్ మీడియా వినియోగం వివాదంపై జనరల్ రావత్ ప్రస్తావించారు. సోషల్ మీడియాను నిషేధించలేం. కానీ, అధికారులు, జవాన్లు ఈ ప్లాట్ ఫాం వినియోగించడంపై నిర్మాణాత్మక ఉద్దేశం ఉండాలన్నారు. సోషల్ మీడియా వలలో పడి ప్రత్యర్థుల్లా ఎలా మారుతున్నామోదానిపై నిశతంగా చర్చించుకున్నాం. ఇకపై సోషల్ మీడియాకు చిక్కేది లేదని రావత్ స్పష్టం చేశారు. 

gay $ex
INDIAN ARMY
Bipin Rawat
Homosexual acts
Supreme Court

మరిన్ని వార్తలు