వీడు మామూలు మొగుడు కాదు : భార్యను చంపాలంటూ పోలీసులకే సుపారీ

Submitted on 8 February 2019
Indian American Plotted To Kill Wife Arrested

వాషింగ్టన్‌: భార్య హత్యకు కుట్ర పన్నిన ఓ భర్త అడ్డంగా బుక్కయ్యాడు. ఆ భర్త వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు. భార్యను మర్డర్ చేయడానికి ఏకంగా పోలీసుకే సుపారీ ఇచ్చి కటకటాల పాలయ్యాడు. అమెరికాలో ఇండియానాలో ఈ ఘటన జరిగింది. విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి భార్యను మర్డర్ చేసేందుకు ప్లాన్‌ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులు దొరికిపోయారు.

 

అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్‌ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి(52) అనే ప్రియురాలు ఉంది. భార్యకు దూరంగా ఉంటున్నా.. ఆమెను లేపేయాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా మిడిలెసెక్స్‌ కౌంటీ కోర్టుహౌస్‌లో 2018 జూన్‌లో ఓ కేసు విచారణ కోసం నర్సన్ వెళ్లాడు. అక్కడ సహచర ఖైదీతో పరిచయం ఏర్పడింది. అతడితో భార్యను చంపడం గురించి నర్సన్ మాట్లాడాడు. నా మాజీ భార్యను చంపాలని, నీకు ఎవరైనా కిరాయి హంతకుడు తెలుసా? అని సహచర ఖైదీని నర్సన్‌ అడిగాడు. నర్సన్‌తో సరే అనిచెప్పిన సహచర ఖైదీ.. తర్వాత ఆ విషయాన్ని జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్‌కవర్‌ ఏజెంట్‌ రంగంలోకి దిగాడు.

 

2018 అగస్టులో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్‌ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో నర్సన్, సంధ్య కలిశారు. నర్సన తన భార్య పూర్తి వివరాలను అతడికి అందించాడు. మర్డర్ చేసేందుకు అతడు 10వేల డాలర్లు డిమాండ్ చేశాడు. ముందే డౌన్‌పేమెంట్‌ ఇవ్వాలన్నాడు. సరే అన్న నర్సన్.. ముందు వెయ్యి డాలర్లు ఇస్తానని చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్‌ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్‌ చేశారు. అప్పటివరకు తాము మాట్లాడింది సుపారీ కిల్లర్ అని వారు అనుకున్నారు. కానీ అతడు కిల్లర్ కాదు పోలీస్ ఆఫీసర్ అని తెలిసి నర్సన్, అతడి లవర్ షాక్ తిన్నారు. వారిద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువైతే వారిద్దరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల ఫైన్ విధించే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Indian American Plotted To Kill Wife
arrested
Narsan Lingala
sandya Reddy
america
undercover officer
killer

మరిన్ని వార్తలు