అప్లై చేసుకోండి: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 249 ఉద్యోగాలు

Submitted on 5 December 2019
Indian Air Force Recruitment 2019 - Apply Online for 249

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) లో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇండియన్ ఎయిర్ ఫొర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ /నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్ సీసీ(NCC) అభ్యర్ధులకు స్సెషల్ ఎంట్రీ కింద 10 శాతం  పోస్టులు కేటాయించారు.  ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషస్ టెస్ట్(AFCAT) సంవత్సరానికి రెండు నోటిఫికేషన్ వెలువడే సంగతి తెలిసిందే. మెుదటి దశలో మే/జూన్ నెలలో , రెండవది డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ ను ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తూ వస్తుంది.

విభాగాల వారీగా ఖాళీలు : 
ఫ్లైయింగ్(SSC) - 60
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) - 105 
గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్) - 84
 
విద్యార్హత : డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ తో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
దీంతో పాటు ఎన్ సీసీ అభ్యర్ధులు ఎన్ సీసీ సర్టిఫికేట్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250 చెల్లించాలి. ఎన్ సీసీ(NCC) అభ్యర్థులు  ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం : కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, ఫైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 01,2019
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 31,2019
పరీక్ష తేది : ఫిబ్రవరి 22,2020 - ఫిబ్రవరి 23,2020

airforce
Job
national

మరిన్ని వార్తలు