టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Submitted on 25 May 2019
india won toss choose to bat

ఇంగ్లాండ్ గడ్డపై తొలి సమరానికి భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయ్ శంకర్ గాయానికి గురవడంతో కేదర్ జాదవ్ తో సహా పక్కన పెట్టేసింది. ఆటగాళ్ల సత్తా అంచనా వేయడం కోసం కెప్టెన్ కోహ్లీ 13మందితో బరిలోకి దిగనున్నాడు. 

కేదర్ జాదవ్ పూర్తి ఫిట్ నెస్ ముందే బరిలోకి దించడం కరెక్ట్ కాదని భావించాడు కెప్టెన్. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పటిష్టంగా కనిపిస్తున్న భారత్.. వరల్డ్ కప్ 2019టోర్నీలో ఫేవరేట్‌గా  కనిపిస్తోంది. 1983, 2011 తర్వాత మూడో టైటిల్ వేటలో ఇంగ్లాండ్ గడ్డపై అడుపెట్టిన భారత్ ఎంతమేర రాణించగలదో చూడాల్సిందే.


టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(c), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్

india
newzealand
cricket

మరిన్ని వార్తలు