భారత్ సిరీస్ గెలిచినా.. హెడ్‌లైన్స్‌లో చాహలే: రోహిత్ శర్మ

Submitted on 21 January 2020
"India Wins The Series But...": Rohit Sharma Trolls Yuzvendra Chahal's Shirtless Photo

ఫ్రెష్‌గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్ లో మాత్రం చాహల్ పేరే ఉందంటూ రోహిత్ శర్మ ఓ ట్వీట్ చేశాడు. దీనికి కారణం ఏంటంటే.. ఒంటి మీద టాట్టూలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ అడుగుజాడల్లో నడిచే హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ల సరసన చేరిపోయాడు చాహల్. 

చాహల్ కుడి భుజం నుంచి ఛాతీ మీది వరకూ టాట్టూ వేయించుకున్నాడు. అది అచ్చం డేన్ జాన్సన్ భుజానికి ఛాతికి కలిపి వేయించుకున్న టాట్టూలా ఉంది. ఆ ఫొటోను యాడ్ చేస్తూ రోహిత్ శర్మ.. ఫన్నీగా చాహల్ పై సెటైర్ వేశాడు. 'ఇవాళ నేను చూసిన బెస్ట్ పిక్చర్ ఇదే. భారత్ సిరీస్ గెలిచానా.. హెడ్ లైన్స్ స్థానాన్ని మాత్రం వేరెవరో కొట్టేశారు' అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. 

వీరిద్దరి మధ్య ఫన్నీ ట్వీట్లు కొత్తేం కాదు.. రోహిత్ శర్మ, అతని భార్య రితికా శర్మపై కలిపి చాహల్ సరదా ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. ఇలా బుక్ అవుతూనే ఉంటాడు. మ్యాచ్ అయిపోగానే మైక్ పట్టుకుని చాహల్ టీవీ అంటూ మైదానంలోకి వచ్చేసే చాహల్ ఈ ట్వీట్ ను కూడా అంతే ఫన్నీగా తీసుకున్నాడు. 'నేను కూడా ద రాక్' అంటూ స్మైలీలతో పోస్టు చేశాడు. 

india
Rohit Sharma
yuzvendra chahal
Shirtless
Team India

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు