భారత్-పాక్ రసవత్తర మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Submitted on 16 June 2019
India vs Pakistan, Match 22 -Rain stops play

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 46.4ఓవర్లకు వర్షం పడుతుండటంతో మ్యాచ్ ను కాసేపటి వరకూ ఆపేశారు. కోహ్లీ(71)పరుగుల వద్ద ఉండగా, మరో ఎండ్‌లో ఉన్న విజయ్ శంకర్(3)ను అంపైర్ అవుట్ ఇచ్చాడు. డీఆర్ఎస్ కోరిన టీమిండియాకు నిర్ణయం తేలేలోపే వర్షం వచ్చేసింది.

స్టార్‌స్పోర్ట్స్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు సెకనుకు లక్షా 60వేల నుంచి లక్షా 80 వేల వరకూ వసూలు చేస్తుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు మాత్రం సెకనుకు రెండున్నర లక్షల రేటు ఫిక్స్ చేసింది. అయినా కూడా యాడ్స్‌ ఇచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. మ్యాచ్‌ రద్దైతే మాత్రం ఆ స్థాయిలో ఆదాయాన్ని నష్టపోవాల్సిందే. ప్రపంచకప్‌ ఫైనల్‌ కంటే భారత్‌ -పాక్‌ మ్యాచ్‌కే ఎక్కువ క్రేజ్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. 

కనీసం నేటి మ్యాచ్‌ అయినా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. వానావానా వద్దప్పా అని వేడుకుంటున్నారు. వర్షం ఆటంకం కలిగించొద్దని పూజలు కూడా చేస్తున్నారు. ఇప్పటికై ఐసీసీపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేకపోవడంపై మండిపడుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్ కూడా రద్దైతే మాత్రం ఐసీసీపై విమర్శలు మరింత పెరుగుతాయి.   

india
Pakistan
MATCH 22


మరిన్ని వార్తలు