భారత్‌కు పసిడిపంట: స్వర్ణం గెలిచిన మేరీ కోమ్, సరితా దేవీ

Submitted on 25 May 2019
India Open Boxing: Mary, Sarita lead hosts

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారంతో ముగిసిన ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది. టోర్నీలో భారత బాక్సర్లు రాణించడంతో భారత్‌కు పసిడి పంట పండింది. 

ఎనిమిది విభాగాల్లో భారత్‌కు స్వర్ణం దక్కగా.. మేరీ కోమ్ 51కేజీల విభాగంలో పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్లో జరిగిన బౌట్‌లో భారత్‌కు చెందిన వన్‌లాల్ డ్యుయాటీను 5-0తేడాతో చిత్తుగా ఓడించింది. మేరీ కోమ్‌తో పాటు సరితా దేవీ(60 కేజీలు), జమునా బొరొ(54 కేజీలు), నీరజ(57 కేజీలు) స్వర్ణం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భారత్ 12 స్వర్ణాలు దక్కాయి. 

సిమ్రాన్ జిత్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అయిన సరితా దేవీ మూడేళ్లలో తన స్వర్ణాన్ని గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయాన్ని గెలిచి గతేడాది క్యాన్సర్‌తో మరణించిన తన తల్లికి అంకితం చేసింది. 

India Open Boxing
Mary kom
Sarita devi
Boxing

మరిన్ని వార్తలు