బీజేపీకి స్టాలిన్ ఘాటు మెసేజ్ : ఇండియా అంటే హిందీ రాష్ట్రాలే కాదు

Submitted on 25 May 2019
India Not Just About Hindi-Speaking States: Stalin's Message To BJP

తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఓ ఘాటు మెసేజ్ ను పంపించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రాన్నీ విస్మరించడానికి వీల్లేదు. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలనే మీరు గుర్తించే రోజులు పోయాయి. ఆ రాష్ట్రాలతోనే దేశం నిర్మితం కాలేదని గుర్తుంచుకోవాలని మోడీ సర్కార్ కు ఘాటైన మెసేజ్ పంపించారు.నిర్మాణాత్మకమైన రాజకీయాలేమైనా పరిధులకు లోబడి మాత్రమే ఉండాలి.

ఈ లోక్‌ సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 38 స్థానాలున్న తమిళనాడులో 36 సీట్లు డీఎంకే గెలిచింది. ఫలితాలు కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ కు ఏ విధంగానూ ఉపయోగపడలేదని డీఎంకే కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా మంచి మెజారిటీ వచ్చి ఉంటే కేంద్రం-రాష్ట్రం మధ్య సత్సంబంధాలు ఉండేవని, దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొనే వాళ్లమని,అయితే ఇప్పుడు అలా జరగలేదని డీఎంకే కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

tamilnadu
BJP
CENTERE
hindi speak
States
politics
constructive
dmk
india
Congress
cadere

మరిన్ని వార్తలు