ఇంగ్లాండ్ గడ్డపై భారత తొలి సమరం నేడే

Submitted on 25 May 2019
India Face New Zealand In World Cup Warm-Up

భారీ అంచనాలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. శనివారం మే25న తొలి వార్మప్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. కెన్నింగ్‌టన్ ఓవల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3గంటలకు ఆరంభం కానున్న మ్యాచ్‌లో భారత్ 15మంది ప్లేయర్లను పరీక్షించనుంది. 

నాల్గో స్థానంపై సందిగ్ధత: 
జట్టు ఎంపిక సమయంలోనే నెలల తరబడి ఆలోచించి నాల్గో స్థానానికి విజయ్ శంకర్ సరిపోతాడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. అయితే ఈ స్థానం కోసం ఇప్పుడు కేఎల్ రాహుల్ పోటీ పడుతుండటంతో జట్టు కూర్పుపై కెప్టెన్ వారిద్ధరి సత్తా అంచనా వేయనున్నాడు. 

గాయాల బెడద: 
కేదర్ జాదవ్ ఐపీఎల్ మ్యాచ్‌లోనే గాయానికి గురై ఇబ్బంది పడ్డాడు. తన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ చూపించి ఇంగ్లాండ్ పయనమైనప్పటికీ ప్రాక్టీస్‌లో కాసేపటి వరకే పాల్గొన్నాడు. మరో వైపు నాల్గో స్థానంలో జట్టుకు ఎంపికైన విజయ్ శంకర్ ప్రాక్టీస్‌లో కుడి చేతికి గాయం అయింది. బాధతో విలవిల్లాడుతున్న శంకర్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. 

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పటిష్టంగా కనిపిస్తున్న భారత్.. వరల్డ్ కప్ 2019టోర్నీలో ఫేవరేట్‌గా  కనిపిస్తోంది. 1983, 2011 తర్వాత మూడో టైటిల్ వేటలో ఇంగ్లాండ్ గడ్డపై అడుపెట్టిన భారత్ ఎంతమేర రాణించగలదో చూడాలి మరి.

ఇండియా: 
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్

india
new zealand
World Cup Warm-Up
world cup 2019
2019 icc world cup
2019 Cricket World Cup

మరిన్ని వార్తలు