‘నిర్భయ’ క్షిపణి ప్రయోగం విజయవంతం

Submitted on 15 April 2019
India Cruise Missile Nirbhay Successfully Test Range Fired in Odisha

బాలాసోర్ (ఒడిషా) : స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారి రూపొందించిన ‘నిర్భయ‘ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. సోమవారం (ఏప్రిల్ 15, 2019) ఒడిషాలో బాలాసోర్ సమీపంలోని చందీపూర్ సముద్రతీర ప్రాంతంలో కాంప్లెక్స్-3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఉదయం 11.44 గంటలకు క్షిపణిని ప్రయోగించినట్టు డీఆర్ డీఓ వర్గాలు వెల్లడించాయి.

వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్షిపణని బహుళ ఉపరితలాలైన భూమిమీద నుంచి, నౌకమీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని నెమ్మదిగా 0.7తో ఎత్తులో 100 మీటర్లు తక్కువ నుంచి 42 నిమిషాల 23 సెకన్లలో కవర్ చేసేలా టార్గెట్ రేంజ్ తో రూపొందించారు.

తొలి ప్రయత్నంలోనే క్షిపణి ప్రయోగంపై విజయం సాధించడంతో శాస్త్రవేత్తలు రక్షణశాఖకు ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాకెట్ బూస్టర్, టర్బోఫాన్/జెట్ సామర్థ్యంతో కూడిన ఇంజిన్ ను అమర్చినట్టు డీఆర్ డీఓ వర్గాలు తెలిపాయి. అధునాతన ఈ క్షిపణిని అన్ని క్లిష్టమైన ఆపరేషన్ల సమయాల్లో నేవిగేషన్ చేసేలా ప్రొగ్రామ్ చేశారు.

భూ ఉపరితల రాడర్లు, దేశీయ టెలీమెట్రి స్టేషన్ల నుంచి ట్రాక్ చేసేలా క్షిపణిని ఆపరేట్ చేసేలా రూపొందించారు. ఈ నిర్భయ్ మిస్సైల్ దాదాపు 300 కిలోల యుద్ధ సామాగ్రిని తరలించగల సామర్థ్యం ఉన్నట్టు డీఆర్ డీఓ వర్గాలు తెలిపాయి. గతంలో 2017, నవంబర్ 7న నిర్భయ్ క్రూయిస్ క్షిణిని విజయవంతంగా ప్రయోగించారు. 

Sub-Sonic Cruise
Cruise Missile
Nirbhay Test Fire
Odisha 

మరిన్ని వార్తలు