టీమిండియా ‘రివెంజ్’ డ్యాన్స్..

Submitted on 7 January 2019
India  team Revenge dance in Australia Sydney in Australia..

ఆస్ట్రేలియా  : టీమిండియా చేసిన  ‘రివెంజ్’డాన్స్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌‌ని కైవసం చేసుకున్న కోహ్లీ సేన సిడ్నీ స్టేడియాన్ని కాసేపు డ్యాన్స్‌తో హోరెత్తించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగిసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆసీస్‌లో టెస్టు సిరీస్‌ గెలవడంతో భారత్ క్రికెటర్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 
మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ జట్టుకి మద్దతు తెలుపుతున్న సిరిస్ ఇండియాకు దక్కటంతో ఫ్యాన్స్ కేకలు, చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కంగారులకు ఝలక్ ఇచ్చింది టీమిండియా. టీమిండియను హేళన చేస్తు..ఆస్ట్రేలియా అభిమానులు చేసిన డ్యాన్స్ కు టీమిండియా సరైన సమాధాన్ని ఇస్తు ‘రివెంజ్ డ్యాన్స్ ’ వైరల్ గా మారింది. ఈ డాన్స్ లో భాగంగా రిషబ్ పంత్ తొలుత స్టెప్ వేయగా..వరుసగా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె ఫాలో అయ్యాడు. తరువాత టీమిండియా  డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరించింది. 

 

india
Australia
cricket
test match
Revenge dance
Captain
Virat Kohli

మరిన్ని వార్తలు