పోలీసులకు వీక్ ఆఫ్ : జ‌గ‌న్ హామీ

Submitted on 25 March 2019
YSRCP CHIEF JAGAN SAID WILL GIVE WEEKLY OFF TO POLICE

రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్లందరికీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు రూ.10,000 వడ్డీ లేని రుణం ఇస్తామని తెలిపారు.పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలని తాను దగ్గరనుంచి చూశానని తెలిపారు.తాను పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను గమనించానని,వాళ్లందరికీ అండగా ఉంటానని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఆర్ఎస్ రద్దు చేస్తామని,27శాతం ఐఆర్ ప్రకటిస్తామని అన్నారు.సకాలంలో పీఆర్ సీ అమలుచేస్తామని తెలిపారు.కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుని,చదువుని పరిగణలోకి తీసుకొని వారిని గవర్నమెంట్ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సమాన పనికి సమాన వేతం తీసుకొస్తామని తెలిపారు.పెన్షనర్ల కోసం అన్నీ జిల్లాల్లో సెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.హోంగార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని తెలిపారు.పోలీసులకు వారానికొక రోజు సెలవు ఇస్తామని తెలిపారు.

weekly off
Police
Footpath
loan
help
INDENTITY CARDS
Jagan
Ysrcp
Power
Elections

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు