కోహ్లీ మోడ్రన్ ఏసు: గ్రేమ్ స్వాన్

Submitted on 26 June 2019
Virat Kohli is a modern day Jesus: Graeme Swann

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని మోడ్రన్ డే ఏసుగా అభివర్ణించాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్. ఇంగ్లాండ్‌లోని లండన్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ టోర్నీలో స్టీవ్ స్మిత్‌ను స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఛీటర్ అంటూ అవమానిస్తుంటే వారికి మద్ధతుగా నిలిచి మరోసారి అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు కోహ్లీ. ఇటీవల స్వానీ క్రికెట్ షోలో మాట్లాడిన స్వాన్.. కోహ్లీ నిజాయితీ కలిగిన క్రికెటర్ అని కొనియాడాడు. 

అవుట్ అని తెలిసినా అంపైర్ చెప్పేంతవరకూ క్రీజులో ఉండిపోయి చాలా మంది బ్యాట్స్‌మెన్ వాదనకు దిగుతుంటారు. నీకు అవుట్ అని తెలిసి అలా ఉండిపోవడం మోసం. బంతి తగిలిందనిపించి అంపైర్ ప్రకటించేంతవరకూ క్రీజులోనే ఉండిపోవడం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే అవుతుంది. కానీ, కోహ్లీ అలా చేయలేదు. అతని బ్యాట్ బంతిని తాకపోయినా అవుట్ అని స్వచ్ఛందంగా వెళ్లిపోయాడు. అది అతని నిజాయితీ. అతను మోడ్రన్ ఏసు' అని స్వాన్ చెప్పుకొచ్చాడు. 

అంతటితో ఆగలేదు. ఈ భూగ్రహంపైన అతను అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీయేనని వెల్లడించాడు. 'నార్మల్ క్రికెటర్ స్థాయి నుంచి కోహ్లీ సూపర్ స్టార్ లా ఎదిగాడు. ఈ క్షణం భూమ్మీద అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీనే. స్మిత్‌ను స్టేడియంలో ప్రేక్షకులు విమర్శిస్తుంటే ఆగమని చెప్పి జెంటిల్‌మెన్ అని నిరూపించుకున్నాడు' అని పొగిడాడు. 

Virat Kohli
modern day Jesus
Graeme Swann
Team India
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు