సేవ్ వాటర్ : లీకైన పైపు వాటర్.. ఫిక్స్ చేస్తున్న కోతి

Submitted on 14 October 2019
Viral video of monkey trying to fix a water leak

నీరు ఎంతో విలువైనది అని అందరికి తెలుసు. కానీ, చాలామంది రోడ్లపై వెళ్లే సమయంలో చాలా చోట్ల నీటి పైపులు పగిలి నీళ్లు వృథాగా పోతుంటాయి. తమ  కళ్ల ఎదుట నీళ్లు వృథాగా పోతున్నప్పటికీ ఎంతమాత్రం పట్టించుకోరు. అలాగే చూస్తుండి పోతారు. నీటిని ఆదా చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కరువు కాటకాల సమయంలో నీటి విలువ ఏంటో తెలిసి వస్తుంది. నీటిని వృథా చేయరాదనే విషయాన్ని ఓ కోతి గుర్తు చేసింది. పైపు లీక్ అయి వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేసింది.

ఎండు ఆకులను తెచ్చి పైపు నుంచి లీక్ అయ్యే నీటిని ఆపేందుకు ప్రయత్నించింది. 14 సెకన్ల నిడివి గల వీడియోలో కోతి తన రెండు చేతులతో లీకైన పైపులోని నీటి ఉధృతిని నియంత్రిస్తోంది. ఎండు ఆకులను అడ్డుపెట్టి నీటిని ఆపడాన్ని చూడవచ్చు.

నిహారిక సింగ్ పంజేటా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కోతి సమయాస్ఫూర్తిని అభినందిస్తూ సంఘీభావం తెలిపారు. మానవులు అజ్ఞాన జీవనశైలిని ఎత్తిచూపుతూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Moneky
Water leak
Pipe water
Dry leaves
Viral Video

మరిన్ని వార్తలు