రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్: బేరాలు.. బెదరింపులు.. పోలీస్ స్టేషన్ కు పంచాయితీ

Submitted on 22 August 2019
Twist Happens in Hero RajTarun Case

తెలుగు హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో ఊహించని మరో మలుపు తీసుకుంది. రాజ్ తరుణ్ చెబుతున్నవి అబద్ధాలని.. తాగి కారు నడిపి ప్రమాదం చేశాడంటూ కాస్టూమ్ డిజైనర్ కార్తిక్ ఆరోపిణలు చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..  ప్రమాదం జరిగిన రోజు రాజ్ తరుణ్ మందు తాగాడని.. అతడిని తాను ప్రశ్నిస్తే మందు తాగిన విషయం అంగీకరించినట్లు చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను ఇంటి బాల్కనీలో ఉన్నానని.. తాను చూసిన వెంటనే వీడియో తీశానన్నాడు. 120 - 140 కిమీ.ల వేగంతో కారు ఢీకొనగా.. వెంటనే కారు దిగిన రాజ్ తరుణ్.. పరిగెత్తి పారిపోయాడని అన్నారు.

అనంతరం రాజ్ తరుణ్ కు మేనేజర్ గా పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర సీన్‌లోకి వచ్చారని విజువల్స్ డిలీట్ చేస్తే రూ.5 లక్షలు ఇస్తానని చెప్పారని.. దానికి సంబంధించిన ఆడియో రుజువులు కూడా తన దగ్గర ఉన్నాయని అంటున్నాడు. మొత్తం రూ. 3లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు నటించినట్లు చెప్పారు.

అయితే కార్తిక్ చెబుతున్న విషయంలో వాస్తవం లేదని అంటున్నారు రాజ్ తరుణ్ మేనేజర్ రాజారవీంద్ర. రాజ్ తరుణ్ వీడియోలతో తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజా రవీంద్ర. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు తీసేస్తాను అని కార్తిక్ అంటున్నాడని, రాజ్ తరుణ్ కెరియర్ పోతుందని మూడు లక్షలు ఇస్తామంటే ఒప్పుకోలేదు అని చెప్పారు రాజా రవీంద్ర. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే మీడియా కు వీడియో లు లీక్ చేస్తానని బెదిరించగా అంత డబ్బులు ఇవ్వలేక సైలెంట్ అయ్యినట్లు చెప్పారు రాజా రవీంద్ర. ఈ విషయంలో న్యాయ పరంగా ముందుకు వెళ్తామని రాజారవీంద్ర చెప్పారు.

Twist
Hero
RajTarun Case

మరిన్ని వార్తలు