లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

Submitted on 24 August 2019
Telangana Student Sriharsha Missing In London

లండన్‌లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. లండన్‌లోని పోలీసులు ఖమ్మంలోని హర్ష కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో హర్ష తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

విషయం తెలుసుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు... ఫోన్‌లో హర్షతండ్రి ప్రతాప్‌తోపాటు వారి బంధువులతో మాట్లాడారు. హర్ష ఆచూకీ కనుగొనడానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. సంఘటన విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్రం ఈ విషయంపై ఆరా తీస్తోంది. 

శ్రీ హర్ష పీజీ విద్యనభ్యసిస్తున్నాడు. స్థానిక బీచ్ హెడ్ అనే బీచ్‌కు సమీప సముద్రమట్టానికి దగ్గరలో శ్రీ హర్షకు సంబంధించిన ల్యాప్ ట్యాప్, ఇతర సామాగ్రీని లండన్ పోలీసులు కనుగొన్నారు. హ్యాండోవర్ మై బిలాంగింగ్స్ పేరెంట్స్ అని ఒక చిన్న సందేశం రాసినట్లు తెలుస్తోంది. రెండు హెలికాప్టర్ల సహాయంతో బీచ్ ప్రాంతంలో పోలీసులు గాలిస్తున్నారు. 
Read More : ఏపీ మాజీ స్పీకర్ కోడెలకు గుండెపోటు

Telangana
student
Sriharsha
Missing
London
Khamma BJP
Minister Kishan Reddy
Namanageshwara Rao

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు