సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ లింక్‌ : అక్కడే తేల్చుకోండి.. PIL కొట్టేసిన సుప్రీం

Submitted on 14 October 2019
SC rejects PIL seeking to link social media accounts to Aadhaar

సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై నకిలీ అకౌంట్లు పుట్టలకొద్ది పుట్టకొస్తున్నాయి. ఏది రియలో.. ఏది ఫేక్ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ భారీగా వ్యాపిస్తోంది. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్ నియంత్రించేందుకు సోషల్ మీడియా అకౌంట్లను వ్యక్తిగత 12 అంకెల ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ లింక్ చేసేలా కేంద్రాన్ని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ, న్యాయవాది సుప్రీంలో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారించిన సుప్రీం కోర్టు సోమవారం (అక్టోబర్ 14)న కొట్టివేసింది.

దీనికి సంబంధించిన ప్రతి విషయాన్నీ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి పిటిషన్ మద్రాసు హైకోర్టులో పరిధిలో ఉంది. అక్కడికే వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 

ఇదివరకే సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ లింక్ చేయాలని కోరుతూ బాంబే, మద్రాసు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫేస్ బుక్ ఇంక్ చొరవతో ఈ రెండు పిటిషన్లను హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంలో విచారించాలని కంపెనీ కోరింది.   

PIL
SC
social media accounts
Aadhaar
Fake
troll accounts

మరిన్ని వార్తలు