ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేస్తే బాదుడే: ఫైన్ ల వివరాలు ఇవే

Submitted on 22 August 2019
Road Rules - MV-Act - Hyderabad Traffic Police

సిటీ రోడ్లపై ఎక్కడ చూసినా చేతుల్లో కెమెరాలతో ట్రాఫిక్ పోలీసులు, హై డెఫినిషన్ సీసీ కెమెరాలు.. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కెమెరాలు.. ఒక్క క్లిక్.. ఫైన్ పడితే కట్టక తప్పదు.. సిగ్నల్ పడినా ఏం కాదులే అని జంప్ చేస్తున్నారా? హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్నారా? సీటు బెల్టు పెట్టుకోట్లేదా? బైక్ పై వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? ఓవర్ స్పీడ్ వెళ్తున్నారా? ట్రిపుల్ రైడింగ్ పట్టుకోరులే అనుకుని పోతున్నారా? అలా అనుకోకండి సిటీలో ఎక్కడ చూసినా నిఘా నేత్రాలే. హైదరాబాద్ సిటీ మొత్తం నిఘా నేత్రాలైన కెమేరాలను పెట్టేశారు పోలీసు అధికారులు.

హైదరాబాద్ సిటీలోని రోడ్లపై మోటార్ వెహికల్ యాక్ట్ ను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు ట్రాఫిక్ పోలీసులు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలపై ఇప్పటికే పోలీసులు ప్రచారం కూడా మొదలెట్టేశారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవాళ్లు.. వాళ్ల జేబులు గుళ్ళ చేసుకోక తప్పదు అంటూ పోలీసులు నగరంలోని పలుచోట్ల ఫ్లెక్సీలు పట్టుకుని నిలబడి వాహనదారులకు సూచనలు చేస్తున్నారు.

నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులే టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు...పెండింగ్ చలానాలతో పట్టుబడితే వెహిల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెబుతున్నారు. 


కొత్త చట్టం ప్రకారం విధించే చలాన్లు క్రింది విధంగా ఉండనున్నాయి

ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్స్‌ వంటి వాటికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా..  ఇప్పటివరకూ రూ.100 జరిమానా ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనల చలానాలను భారీగా పెంచనున్నారు.

లైసైన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.5 వేలు,

వాహనం ఇన్సూరెన్స్‌ కాపీ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే రూ.2 వేలు,

ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తే రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, 

సీట్‌బెల్టు లేకుండా ప్రయాణిస్తే రూ.వెయ్యి

హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ.వెయ్యి,

పరిమితికి మించిన లోడ్‌తో వెళ్తే రూ.20 వేలు, 

డేంజరస్ డ్రైవింగ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు,

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే రూ.10వేలు

సిగ్నల్ జప్ చేస్తే రూ.5వేలు

ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.5వేలు

వ్రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.5వేలు

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5వేలు

Road Rules
MV-Act
hyderabad traffic police

మరిన్ని వార్తలు