గంగూలీ నియామకంపై తొలి సారి స్పందించిన రవిశాస్త్రి

Submitted on 27 October 2019
Ravi Shastri reacts on Sourav Ganguly’s appointment as BCCI president, says ‘It’s a win-win for Indian cricket’

బీసీసీఐ 39వ ప్రెసిడెంట్‌గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు. గతంలో పలు మార్లు వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో కౌంటర్లు విసురుకున్న వారే. 

కాకపోతే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యేసరికి రవిశాస్త్రి ట్రాక్ మార్చినట్లు కనిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవికి గంగూలీ చెక్ పెడతాడనే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి  'బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ ఎన్నికైనందుకు నా హృదయపూర్వ అభినందనలు. అతని నియామకమే స్పష్టం చేస్తుంది. భారత క్రికెట్ సరైన మార్గంలో వెళుతుందని' అని చెప్పుకొచ్చాడు.  

ఇంకా మాట్లాడుతూ.. 'అతను సహజమైన నాయకుడు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో నాలుగైదుళ్లుగా కొనసాగుతున్న వ్యక్తి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం కలిసొచ్చే అంశం. ఇలాంటి క్లిష్టమైన సమయంలో గంగూలీకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా' అని వెల్లడించాడు. 

ravi shastri
sourav ganguly
appointment
BCCI president
Indian cricket
india

మరిన్ని వార్తలు