పవన్‌తో మరోసారి..

Submitted on 25 February 2020
Powerstar Pawan Kalyan will Romance with Keerty Suresh Again

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ కాంబినేషన్లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏ. ఏం.రత్నం ఓ సినిమా  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నటిస్తున్న 27వ సినిమా ఇది. ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల తర్వాత పవన్, ఏ. ఎం.రత్నం కలయికలో రూపొందుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.

పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఈమే అంటూ పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. క్రిష్, ప్రగ్యా జైస్వాల్‌ని ఫిక్స్ చేసాడని వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత కీర్తి, పవన్‌తో రెండోసారి రొమాన్స్ చేయనుంది.


క్రిష్, ఈ సినిమాలో పవర్ స్టార్‌ని ఓ కొత్త తరహా పాత్రలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : జ్ఞాన శేఖర్.  
 

Powerstar Pawan Kalyan
PSPK 27
Keerty Suresh
Mega Surya Productions
MM Keeravani
AM Ratnam
Krish

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు