కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త

Submitted on 13 January 2020
Now 200 Channels Instead Of 100 In Rs 130, Says TRAI

కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది. టారిఫ్ ఆర్డర్‌కు ట్రాయ్ తాజాగా సవరణలు చేసింది. ఇవి వినియోగదారులకు మేలు చేసేవిగా ఉన్నాయి. రూ.130కే (NCF) ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ఇవ్వాలని ట్రాయ్ నిర్ణయించింది.

ట్రాయ్ చేసిన ఈ సవరణల ప్రకారం ఇక 130 రూపాయలకే దాదాపు 200 ఛానల్స్‌ను వీక్షించే అవకాశం ఉంది. గతంలో వంద ఛానల్స్ మాత్రమే చూసే వీలుంది. అంతేకాదు, మెజార్టీ ప్రజలు వీక్షించే స్పోర్ట్స్ ఛానల్స్ ధరలు కూడా ఒక్కో ఛానల్‌కు 12 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

బొకే చానెల్స్‌లో ఒక చానెల్‌ ఖరీదు రూ.12కు మించకూడదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ఈ ధర రూ.19 గా ఉండేది. ప్లేస్‌మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే 40 శాతం వసూలు చేయాలని కేబుల్ ఆపరేటర్లకు ట్రాయ్‌ సూచించింది.  కేబుల్ బిల్లు భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం కాస్త ఉపశమనం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Also Read : Jioకు షాకిచ్చిన Airtel : Wi-Fi Calling సరికొత్త రికార్డు!

200 channels
TRAI
CABLE
Tariff
amendments

మరిన్ని వార్తలు