గమనిక : 3 రోజులూ నీటి సరఫరాకు అంతరాయం..ఏరియాలు ఇవే

Submitted on 14 October 2019
No water supply for three days In Hyderabad

హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గోదావరి జలాల సరఫరాలో ఇబ్బంది కలుగుతోందని ఫలితంగా ఈ అసౌకర్యం కలిగిందని అధికారులు తెలిపారు. అందువల్ల నగరంలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 

ఏరియాలు ఇవే : - 
బొల్లారం, అమీన్ పూర్, మల్లంపేట, జవహార్ నగర్, బాలాజీ నగర్, కీసర, దమ్మాయిగూడ, నాగారం, చీర్యాల, ఆర్ జికే, అహ్మద్ గూడ, దేవరయాంజాల్, తూంకుంట, ఎన్ఎఫ్‌సీ, పోచారం, సింగపూర్ టౌన్ షిప్, మౌలాలీ, లాలాపేట, తార్నాక, సీఆర్పీఎఫ్ మెస్, కంటోన్మెంట్ బోర్డు పరిధి, తుర్కపల్లి, బయోటెక్ పార్కు, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, షేట్ బషీరాబాద్, డిఫెన్స్ కాలనీ, గౌతంనగర్, ప్రశాంత్ నగర్, చాణక్యపురి, మల్కాజిగిరి, అల్వాల్, న్యూ ఓయూటీ కాలనీ, కైలాసగిరి, హఫీజ్ పేటలో నీటి సరఫరా ఉండదు.

మియాపూర్, మాతృశ్రీనగర్, మయూరి నగర్, చందానగర్, ఆర్ సీపురం, పటన్ చెరు, మయూరీ నగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, మియాపూర్‌లో కూడా నీటి సరఫరా జరగదు. ఎర్రగడ్డ, బోరబండ, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, సనత్ నగర్, జూబ్లిహిల్స్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాలానగర్, భాగ్యనగర్, భరత్ నగర్, సనత్ నగర్, బోరబొండ రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరా ఉండదు. 
Read More : ఆర్టీసీ సమ్మె ఉధృతం : కుటుంబసభ్యులతో బైఠాయింపు

No Water
supply
three days
Hyderabad

మరిన్ని వార్తలు