ఒక్క వీడియోను 28,763 సార్లు చూసిన నెటిజ‌న్

Submitted on 14 January 2020
Netizen Viewing the Black Widow movie teaser 28,763 times

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో బాగా న‌చ్చితే వంద సార్లు చూస్తాం. ఇంకా బాగా నచ్చితే 500 సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజ‌న్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడ‌ట‌. అయితే మ‌రోసారి చూడాల‌ని భావించిన నెటిజ‌న్‌కి నిరాశ ఎదురైంది. 

ఇప్ప‌టికే మీరు 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని యూ ట్యూబ్ నెటిజ‌న్‌ కు హెచ్చ‌రిక జారీ చేసింది. దీంతో చేసేదేం లేక నెటిజ‌న్ మ‌ళ్ళీ ఆ వీడియో చూసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఈ విష‌యాన్ని మార్వెల్ త‌న ఫేస్ బుక్‌లో స్క్రీన్ షాట్ తీసి పెట్ట‌డం విశేషం.
 

Netizen
Viewing
Black Widow movie
teaser
28
763 times

మరిన్ని వార్తలు