బాబాయ్ ను కొట్టిన చరిత్ర నీది : జగన్ పై.. నారా రోహిత్ కామెంట్స్

Submitted on 25 March 2019
Nara rohit counters to Jr NTR Father in law Narne Srinivasa Rao


నారా వారి హీరో రోహిత్.. మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న విమర్శలు, పెదనాన్న చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. లేఖ విడుదల చేశారు. జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు.
జగన్ గారు.. ఎంపీ పదవి కోసం సొంత బాబాయ్ వివేకానందరెడ్డిపైనే చేయి చేసుకున్న చరిత్ర నీది అంటూ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మాకు పదవులు కాదు ముఖ్యం.. అటువంటి చరిత్ర కూడా అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు రోహిత్. కోర్టు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు.. కుటుంబ విలువల గురించి అంటూ మండిపడ్డారు జగన్ పై. సంక్రాంతి పండుగను అందరం కలిసి ఆనందంగా జరుపుకుంటున్నాం.. మా అందరికీ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను పెదనాన్న చంద్రబాబు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.
నా తండ్రి రామ్మూర్తినాయుడు అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితం అయ్యారని.. వైద్యం చేయిస్తున్నామని తెలిపారు. రాజకీయం కోసం మా కుటుంబాన్ని రోడ్డుపైకి లాగొద్దని సూచించారు నారా రోహిత్. 40 ఏళ్ల క్రితమే సమాజాభివృద్ధి కోసం మా ఆస్తులను రాసిచ్చామని వెల్లడించారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రోహిత్. మా కుటుంబాన్ని పెదనాన్న చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన నూటికి నూరుశాతం అవాస్తవం అని.. అందులో నిజం లేదని స్పష్టం చేస్తూ లేఖ విడుదల చేశారు.
 

Nara rohit
NTR
narne srinivasa rao
TDP
Chandra Babu

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు