వాంఖడే వన్డే : హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో కేఎల్ రాహుల్ ఔట్

Submitted on 14 January 2020
mumbai odi, kl rahul out

ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో రాహుల్ పెవిలియన్ చేరాడు. 61 బంతుల్లో 47 పరుగుల చేశాడు. అగర్ బౌలింగ్ లో స్మిత్ క్యాచ్ పట్టాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 66 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. సెంచరీ దిశగా సాగిపోతున్నాడు.

కాగా, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగులకే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రోహిత్ 10 పరుగులు మాత్రమే చేశాడు. టాస్ గెలిచిన ఆసీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజ్ లోకి వచ్చాడు. ధవన్, రాహుల్ జోడీ రెండో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం చేసింది.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికైంది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి. పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగాయి. దీంతో ఈ వన్డే సిరీస్‌ హోరాహోరీగా జరగనుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన విరాట్ సేనకు..ఈ సిరీస్ అసలైన పరీక్ష కానుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్‌.. సిరీస్‌ సొంతం చేసుకుంది.

Also Read : సానియా సెకండ్ ఇన్నింగ్స్: తొలి రౌండ్ అదుర్స్

KL Rahul
out
Virat Kohli
Team India
Australia
Mumbai
ODI
Wankhede

మరిన్ని వార్తలు