అందుకే చంపాను : భార్యను నరికి తలతో పోలీసు స్టేషన్‌కు భర్త

Submitted on 11 November 2019
UP man walks to police station with wife's severed head

భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడో భర్త. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కత్తితో భార్య తల నరికేశాడు. భార్య తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎత్ముదుల్లా ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్ అనే వ్యక్తి.. టీవీ రిపేర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 17ఏళ్ల క్రితమే శాంతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

మద్యానికి బానిసైన నరేశ్.. తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. భార్యపై అనుమానంతో ఆమెను కొట్టి హింసించేవాడు. ఆ రోజు ఆదివారం.. ఇంట్లోనే కూర్చొని మద్యం తాగేందుకు ప్రయత్నించాడు. భార్య శాంతి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నరేశ్ కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో కత్తి తీసుకొచ్చి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణ లేకుండా ఆమె తలను నరికి వేరు చేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేశాడు. 

ఉదయాన్నే పిల్లలు లేచి తల్లి శాంతి కోసం వెతికారు. తల్లిదండ్రుల కోసం గది అంతా వెతికారు. గదిలో నేలపై పడి ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి నివ్వెరపోయారు. వెంటనే బంధువులను పిలిచి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేశ్ కోసం గాలిస్తున్నారు. 

ఈ క్రమంలో నిందితుడు తన భార్య తలను చేతబట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. విచారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాను తాగలేదని బుకాయించాడు. పైగా తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే చంపేశానని నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం పరీక్షలు జరిపింది. అప్పటికే నిందితుడు నరేశ్.. నేలపై, కత్తిపై రక్తపు మరకలను శుభ్రం చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.  

UP man
police station
wife
severed head
Etmadudaula area
extra-marital relations

మరిన్ని వార్తలు