సికింద్రాబాద్‌లో కలకలం : ఇంట్లో ఒంటరి మహిళపై అత్యాచారయత్నం

Submitted on 25 February 2020
man rape attempt on women in secunderabad

మహిళలకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోనూ కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఏ కామాంధుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతాడో అనే భయంతో మహిళలు భయాందోళన చెందుతున్నారు. మహిళ రక్షణ కోసం కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులకు ఉరిశిక్షలు విధిస్తున్నా, ఎన్ కౌంటర్ చేస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు కాటేయాలని చూస్తున్నారు. 

సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. మంగళవారం(ఫిబ్రవరి 25,2020) రాత్రి లోయనగర్ లో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళపై అత్యాచార యత్నం జరిగింది. ఇంట్లోకి దూరిన దుండగుడు మహిళపై అఘాయిత్యం చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించిన బాధిత మహిళ గట్టిగా కేకలు వేసింది. ఈ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు.. ఆ ఇంట్లోకి వెళ్లారు. నిందితుడిని పట్టుకున్నారు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. బాధితురాలు కేకలు వేయడంతో తృటిలో ఘోరం తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. అతడి వివరాలు తెలుసుకుంటున్నారు.

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళపై అత్యాచారయత్నం జరగడం కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉండే మహిళలు భయాందోళనకు గురయ్యారు. మహిళకు భద్రత కరువైందని వాపోయారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలు, చిన్నారులపై ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు.. కాటేస్తున్నారు. కఠిన చట్టాలు తెచ్చిన, ఉరి శిక్షలు విధిస్తున్నా మార్పు రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Secunderabad
Rape Attempt
lonely
Woman
house
Nirbhaya
disha
Hyderabad
Security
RAPISTS

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు