న్యూజిలాండ్ ఘటనపై విచారంలో కోహ్లీ

Submitted on 15 March 2019
KOHLI TWEETED SADLY ON NEW ZEALAND ISSUE

స్డేడియంలో ప్రవర్తించే తీరే కోహ్లీ సున్నిత మనస్తత్వమేంటో చెప్పేయొచ్చు. మ్యాచ్ గెలుపోటములపై తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తుంటాడు. శుక్రవారం మార్చి 15 న్యూజిలాండ్‌లో నమాజ్ చేసుకునేందుకు మస్జీద్‌కు వెళ్లిన 49 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. క్రిస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న మసీదుకు 300కు పైగా హాజరైన వారిలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు క్రికెటర్లు ఉన్నారు. 

ఆగంతకుడు వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో క్షణాల వ్యవధిలో పదుల సంఖ్యలో కుప్పకూలిపోయారు. ప్రాణభయంతో మిగిలిన వారంతా పరుగులు పెట్టారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచమంతా ఉలిక్కిపడింది. దీనిపై కోహ్లీ తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. 
Read Also: నో యోయో: చెన్నై సూపర్ కింగ్స్‌ స్పెషల్

'షాకింగ్ అండ్ ట్రాజిక్.. షాక్‌తో పాటు విచారం వ్యక్తం చేయాల్సిన విషయం. క్రిస్ట్‌చర్చ్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఓ పిరికిపంద చర్య. బంగ్లాదేశ్ జట్టు బాగానే ఉందని ఆశిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి' అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. 

ఈ ఘటనపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంతాపాన్ని ప్రకటించింది. 'ఘటనలో గాయపడ్డ కుటుంబాలకు వారి స్నేహితులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. న్యూజిలాండ్.. బంగ్లాదేశ్ ఇరు జట్ల మేనేజ్మెంట్‌లు కలిసి హగ్లే ఓవల్ వేదికగా ఆడాలనుకున్న టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నాం. ఇరు జట్లు, సహాయక సిబ్బంది జాగ్రత్తగా ఉన్నారని తెలియజేస్తున్నాం' అని వెల్లడించింది. 
Read Also: కోహ్లీకి ధోనీ వార్నింగ్: లేట్ చేయొద్దు

Virat Kohli
new zealand
cricket
bangladesh

మరిన్ని వార్తలు