జూన్ 1 నుంచి కొత్త రూల్: లూజ్ స్వీట్లు అమ్మేముందు ఎప్పటివరకూ తినాలో చెప్పాల్సిందే!

Submitted on 26 February 2020
జూన్ 1 నుంచి కొత్త రూల్: లూజ్ స్వీట్లు అమ్మేముందు ఎప్పటివరకూ తినాలో చెప్పాల్సిందే!

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కీలక నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు .. షాప్ లో లూజ్ గా(నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్) అమ్మే స్వీట్లపై మ్యానుఫ్యాక్చర్(తయారీ) తేదీ manufacturing date, బెస్ట్ బిఫోర్ డేట్(ఎక్స్ పైరీ) best before date కచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ స్వీట్లు ఏ తేదీన చేశారు, ఎన్ని రోజుల వరకు అవి ప్రెష్ గా ఉంటాయి అనే వివరాలు ఇండికేట్ చేయాలి. ఇప్పటివరకు ఈ నిబంధన ప్యాకేజ్డ్ స్వీట్లకు మాత్రమే వర్తించేది. ఇకపై విడిగా అమ్మే మిఠాయిలకు (loose sweets) కూడా వర్తిస్తుంది. 2020 జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధలు అమల్లోకి వస్తుంది.

మ్యానుఫ్యాక్చర్, ఎక్స్ పైరీ డేట్ మస్ట్:
విడిగా అమ్మే మిఠాయిలు ఎప్పుడు తయారు చేశారు, ఎక్స్ పైరీ డేట్ వివరాలు తప్పకుండా ప్రదర్శించాలి. ఈ మేరకు అన్ని మిఠాయి షాపులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. చాలా వరకు షాపుల్లో ఎక్స్ పైరీ డేట్(expiry date0 అయిపోయిన స్వీట్లను విక్రయిస్తున్నారని, దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ (food safety) అధికారులు కొత్త నిబంధన తీసుకొచ్చారు.

ప్రజల ఆరోగ్యం కోసం:
ప్రజల ప్రయోజనం కోసం, వారి ఆరోగ్య సంరక్షణ కోసం, ఫుడ్ సేఫ్టీ కోసం.. ఇకపై లూజ్ గా అమ్మే స్వీట్లపై డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, బెస్ట్ బిఫోర్ తేదీలు ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. 2020 జూన్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్(ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్) రెగులేషన్స్, 2011 చట్టం ప్రకారం.. ప్యాకేజ్డ్ స్వీట్ బాక్సులపై బెస్ట్ బిఫోర్ తేదీ కచ్చితంగా ఉండాలనే నిబంధన ఉంది. ఇదే నిబంధనను ఇప్పుడు లూజ్ గా అమ్మే స్వీట్లకు కూడా తీసుకొచ్చారు. పదార్ధం యొక్క స్వభావం, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆయా స్వీట్లు ఎన్ని రోజుల వరకు బాగుంటాయనే తేదీలను తెలపాల్సి ఉంటుంది.

ఉల్లంఘిస్తే చర్యలు:
రసగుల్లా, బాదం మిల్క్, రసమలై లాంటి స్వీట్లు.. తయారు చేసిన సమయం నుంచి 48 గంటల వరకు అంటే.. రెండు రోజుల వరకు మాత్రం తినడానికి పనికొస్తాయి. ఆ తర్వాత వాటిని పారేయాల్సిందే. లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరు వ్యాపారులు తమ స్వార్థంతో డేట్ అయిపోయినా.. స్వీట్లను వినియోగదారులకు అంటగడుతున్నారని, వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. జూన్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సాధారణంగా మనం ఏదైనా తిండి పదార్థం లేదా మెడిసిన్ కొనేముందు దానిపై మ్యానుఫ్యాక్చర్, ఎక్స్ పైరీ డేట్ చూస్తాం. ఆ తర్వాతే వాటిని కొనాలా వద్దా అని నిర్ణయించుకుంటాం. ఒక వేళ డేట్ అయిపోయి ఉంటే.. వాటిని కొనుగోలు చెయ్యము. అయితే స్వీట్ షాపుల్లో లూజ్ గా అమ్మే మిఠాయిలపై మాత్రం ఎలాంటి తేదీలు కనిపించవు. ఎప్పుడు తయారు చేశారు, ఎన్ని రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.. ఇలాంటి వివరాలు ఏవీ మనకు తెలిసే చాన్స్ లేదు. వాస్తవానికి ఎక్స్ పైరీ డేట్ అయినా.. వ్యాపారులు వాటిని అలానే కస్టమర్లకు అమ్మేస్తున్నారు. జూన్ 1 నుంచి మాత్రం ఇలా కుదరదు. బెస్ట్ బిఫోర్ డేట్ మస్ట్ గా తెలపాల్సిందే. ఈ నిబంధన పట్ల వినియోగదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది మంచి నిబంధన అంటున్నారు. ఇకపై వ్యాపారులు కస్టమర్లను మోసం చేసే అవకాశం ఉండదని అంటున్నారు.

From June 1
loose sweets
best before date
manufacturing date
non packaged sweets
packaged sweets
Food Safety and Standards Authority of India
FSSAI
mithai
sweet shop owners

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు