చెక్ ఇట్: ITBPలో 496 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

Submitted on 25 March 2019
ITBP Recruitment 2019: Apply Online For 496 Medical Officer

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌ (ITBP) మెడికల్ ఆఫీసర్ (గ్రూప్-A) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్- కమాండ్), స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్), కేంద్ర భద్రతా బలగాల్లో మెడికల్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ కమాండ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు (ఏప్రిల్ 2, 2019) నుంచి (మే 1, 2019) వరకు అధికారక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

వయసు పరిమితి:
మే 1 నాటికి సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 50 సంవత్సరాలు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 40 సంవత్సరాలు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 30 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు.. 
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.04.2019. 
* దరఖాస్తుకు చివరితేది:       01.05.2019. 
* ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.05.2019.

పోస్టుల వివరాలు:

            పోస్టులు   పోస్టుల సంఖ్య
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్  04
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్  175
మెడికల్ ఆఫీసర్స్ 317
మొత్తం ఖాళీలు   496
ITBP Recruitment
Apply Online
Medical Officer Posts
2019

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు