కోహ్లీపై రచయిత్రి భావన అరోరా డబుల్ మీనింగ్ ట్వీట్

Submitted on 19 January 2020
India Vs Australia First One Day Match Writer Bhavna Arora Tweet

రచయిత్రి భావన అరోరా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. డబుల్ మీనింగ్‌తో ఆ ట్వీట్ ఉండడమే కారణం. తమ అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ, అతని భార్య, హీరోయిన్‌ అనుష్కపై వేరే అర్థం వచ్చేలా ట్వీట్ ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
ఆస్ట్రేలియా - ఇండియా జట్ల మధ్య తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై ప్రముఖ రచయిత్రి భావన అరోరా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియన్లతో విరాట్ కోహ్లీ కొత్త యాంగిల్స్ చేయడం..తనతో ఆ పని చేయకపోవడం వల్లే అనుష్క శర్మ కోపంతో ఉందని బూతు అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. జట్టు విజయాల కోసం ప్రయోగాలు చేసే కోహ్లీపై దంద్వర్థం వచ్చే విధంగా ఉండడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. 


భావన అరోకు మతి చెడిపోయిందని, ఆమెను గంగలో ముంచాలని ఓ నెటిజన్ స్పందించారు. కోహ్లీని తిట్టాలని అనుకుంటే..తిట్టొచ్చు గానీ..మధ్యలో అనుష్కను లాగడం ఎందుకంటు మరొకరు, వీళ్లు మహిళ రక్షణ కోసం మాట్లాడుతారా ఇంకొకరు ధ్వజమెత్తారు. ఇలా చాలామంది తిట్టిపోశారు. 
Read More : CAA - ‘పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే వీల్లేదు’

అసలేం జరిగింది :-
సాధారణంగా మూడోస్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతుంటాడు. కానీ ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. అతి తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో అభిమానులు నిరుత్సాహ పడ్డారు. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. రెండో వన్డేలో కోహ్లీ మూడోస్థానంలో దిగి..78 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

india
Australia
FIRST
One Day
Match
Writer Bhavna Arora
Tweet
Anushka Sharma
Angry
Virat Kohli
trying
new positions
Australians

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు