ఆంధ్రాలో బాబు కోసం ప్రచారం చేస్తా : మాజీ ప్రధాని

Submitted on 25 March 2019
HD Deve Gowda TOLD WILL CAMPAIGN FOR AP CM CHANDRABABU NAIDU

ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచారం చేస్తానని, చంద్రబాబు కూడా తనను ఆహ్వానించారని దేవెగౌడ తెలిపారు.తాము సెక్యులర్ పార్టీలను నడుపుతున్నట్లు తెలిపారు.
 
కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ నియోజకవర్గానికి జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019)దేవెగౌడ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...తముకూరు నుంచే బరిలోకి దిగాలని అనేకమంది జేడీఎస్,కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు.వారి సూచన మేరకే తుముకూరు నుంచి బరిలోకి దిగుతున్నాను.తుముకూరు సిట్టింగ్ ఎంపీ ముద్దహనుమేగౌడను ఈ నిర్ణయం బాధించవచ్చు.ఆయనను బాధించాలన్నది నా ఉద్దేశ్యం కాదు.కాంగ్రెస్ నాయకులు అతనని అన్ని విధాలా ఒప్పించారు.


జేడీఎస్‌ కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ కాంగ్రెస్ మాకు సీఎం స్థానాన్నిఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,సోనియా గాంధీ సహకారంతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తరఫున రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తాను. అలాగే ఆంధ్రాకు కూడా వెళ్తాను.చంద్రబాబుకి మద్దతుగా ప్రచారం చేస్తా.మావి సెక్యులర్ పార్టీలు.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని దేవెగడ తెలిపారు. 

దేవెగౌడ తన సిట్టింగ్ స్థానమైన హాసన్ నుంచి తన మనవడిని లోక్ సభ బరిలోకి దించారు. దశాబ్దాలుగా హాసన్ దెవెగౌడ కంచుకోటగా ఉంది.అయితే ఈ సారి ఆ సీటుని తన మనువడికి కేటాయించడంతో ఆయన తుముకూరు నుంచి బరిలో నిలిచారు.కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా తుముకూరు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ జేడీఎస్ కు కేటాయించిన విషయం తెలిసిందే.

JDS
DEVEGOWDA
PM
Former
Congress
alliance
karnataka
andhrapradesh
campaign
Support
Chandrababu
secular
Invite

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు