గోపనపల్లి భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్.. డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్.. రేవంత్ రెడ్డి సోదరుల భూ లావాదేవీల్లో అక్రమాల ఆరోపణలు

Submitted on 25 February 2020
gopanapally land scam, govt suspend deputy collector

గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుంది. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లొద్దని శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. 

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి ఈ భూముల్లో ఆరు ఎకరాలకు పైగా కొనుగోలు చేశారనే అరోపణలు వస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి సోదరుల భూ లావాదేవీల్లో అక్రమాలకు సహకరించారన్న ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చి కేవలం మ్యుటేషన్ ఆధారంగానే భూముల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. భూముల మ్యుటేషన్‌పై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్‌ కుమార్‌ ఆదేశించారు. విచారణలో గోపనపల్లి భూముల లావాదేవీలపై మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


* గోపనపల్లిలో భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్‌
* ఎంపీ రేవంత్ సోదరుల భూ లావాదేవీల్లో అక్రమాల ఆరోపణలు
* డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసిన సీఎస్‌
* రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు
* అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్‌

* కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి , ఆయన సోదరుడు కొండల్ రెడ్డి 6 ఎకరాలకు పైగా కొనుగోలు  
* రెవెన్యూ రికార్డుల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చి.. కేవలం మ్యుటేషన్ ఆధారంగానే భూముల లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు
* భూముల మ్యుటేషన్‌పై సమగ్ర విచారణ జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం
* విచారణలో గోపనపల్లి భూముల లావాదేవీలపై మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం

Gopanpally village
land scam
Ranga Reddy
telangan government
Suspension
KCR
MP Revanth Reddy
kondal reddy
Srinivas Reddy
ILLEGAL
fraud

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు