మరీ ఇంత చెత్త ప్రమోషనా: దీపికా పదుకొణె TikTok ఛాలెంజ్

Submitted on 19 January 2020
Deepika Padukone throws TikTok challenge on her Chhapaak acid survivor ‘look’. Disgusting, says Internet

దీపికా పదుకొణె ప్రమోషన్ మరింత చెత్తగా ఉందంటూ సోషల్ మీడియా తిట్టిపోస్తుంది. ఇటీవల యాసిడ్ బాధితురాలి బయోపిక్ చెపాక్‌తో థియేటర్లలో మెప్పించిన దీపికా.. ప్రమోషన్ లో భాగంగానే ఇవన్నీచేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థుల నిరసనకు వెళ్లినా ప్రమోషన్ అని వెక్కిరిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా దీపికా చాలామంది టిక్ టాక్ స్టార్లను కలిసింది. అందులో ఒకరిని తన సినిమాల్లో గెటప్‌లకు టిక్ టాక్ చేయాలంటూ కోరింది. వాటిలో ఒకటి ఓం శాంతి ఓంలో క్యారెక్టర్, పీకూలో క్యారెక్టర్, మూడోది చెపాక్ మూవీలో లక్ష్మీ క్యారెక్టర్ చేయమని కోరింది. దీపికా విసిరిన చాలెంజ్ ను ఓమేకప్ ఆర్టిస్ట్ తీసుకుంది. 

ఆ గెటప్ లతో టిక్ టాక్ చేసి పోస్టు చేసింది. వీటిపై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం చీప్ స్టంట్లన్నీ చేస్తుందంటున్నారు. చెపాక్ లో యాసిడ్ దాడి జరిగిన ముఖంతో టిక్ టాక్ చేయమని చెప్పడం ఏ రకమైన ప్రమోషన్ ఆలోచించావా అంటూ.. నిన్ను చూస్తే సిగ్గుగా అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. 

 

 

Deepika Padukone
TikTok challenge
Chhapaak
acid survivor
INTERNET
Chhapaak challenge

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు