ఏపీ అసెంబ్లీ : 11 కీలక బిల్లులు..మద్యం విక్రయం, రవాణాపై ఉక్కుపాదం

Submitted on 16 December 2019
AP Assembly 11 key bills

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు 11 కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లును మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టనున్నారు. 

మద్దతు ధర కోసం చిరు, పప్పు ధాన్యాల బోర్డుల ఏర్పాటుపై బిల్లు తేనుంది ఏపీ ప్రభుత్వం. చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సాహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం ఈ బోర్డుల లక్ష్యం. ఈ బోర్డులు స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయి. అవసరమైన సమయంలో మార్కెట్‌లో రైతులకు మెరుగైన ధరలు లభించని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తారు. 

అక్రమ మద్యం విక్రయి రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా, తయారు చేసినా, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. మొదటిసారి పట్టుబడితే..రూ. 2 లక్షల ఫైన్, రెండోసారి పట్టుబడితే..రూ. 5 లక్షల ఫైన్ విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా 2 రెట్లు ఫైన్ విధిస్తారు. ఇదే రెండోసారి తప్పు చేస్తే..లైసెన్స్ రద్దు చేసేలా ఎక్సైజ్ చట్టంలో సవరణలకు బిల్లు రూపొందించారు. 

* మద్యంపై అదనపు ఎక్సైజ్ డ్యటీ విధింపు
* మార్కెట్ కమిటీల పునర్ వ్యవస్థీకరణ
* కొత్తగా జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, 
* యూనివర్సిటీల చట్టంలో పలు సవరణలు
* ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టంలో సవరణ.
* ఏపీ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ. దీంతో పాటు మరికొన్ని బిల్లులను ఏపీ అసెంబ్లీ ముందుకు రానున్నాయి. 
Read More : మహిళలకు స్వాతంత్య్రం రాలేదు.. చట్టంలో లొసుగులు: హోంమంత్రి

AP Assembly
key bills
Jagan

మరిన్ని వార్తలు