కొడుకుని బయటపెట్టి లోపల ప్రియుడితో రాసలీలలు.. భర్త వీడియో కాల్‌తో దొరికిపోయిన భార్య

Submitted on 26 February 2020
4-year-old boy informs father about mother's affair, thrashed to death by her paramour

వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆగడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పోతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త.. సుఖాలు వెతుక్కుంటున్నారు. పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. తమ సుఖం కోసం కట్టుకున్న వారినే కాదు కన్నపిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. 

కన్నబిడ్డనే చంపించింది:
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి నాలుగేళ్ల కొడుకు తండ్రికి చెప్పాడనే కోపంతో.. ప్రియుడితో కన్నకొడుకునే చంపించింది ఆ కసాయి తల్లి. కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచికి చెందిన దీపకి విక్రమాన్సింగపురానికి చెందిన ఆంటోని ప్రకాష్‌తో 2015లో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకు లోకేష్ ఉన్నాడు. దీపకి అదే గ్రామానికి చెందిన సొరిముత్తు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రకాష్ పనికి వెళ్లాక వాళ్లిద్దరూ రాసలీలలు సాగించేవారు. కొడుకు ఎదుటే తల్లి ప్రియుడితో ఎంజాయ్ చేసేది.

వీడియో కాల్‌తో దొరికిపోయిన భార్య:
ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడితో కలిసి లాడ్జికి వెళ్లిన దీప.. నాలుగేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లింది. కొడుకుని బయట నిలబెట్టిన దీప.. లోపల ప్రియుడితో రాసలీలలు సాగించింది. బయట నిలబడిన కొడుకుని ప్రియుడు కొట్టినా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆమె భర్త వీడియో కాల్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. దీప వ్యవహారం భర్తకు తెలిసిపోయింది. తండ్రితో ఫోన్ మాట్లాడిన నాలుగేళ్ల కొడుకుపై దీప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడు సొరిముత్తు.. చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా.. లోకేష్ ను దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో లోకేష్ స్పాట్ లోనే చనిపోయాడు. ఆ తర్వాత దీప, ఆమె లవర్ అక్కడి నుంచి పారిపోయారు. దీపను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సొరిముత్తు కోసం గాలిస్తున్నారు.

కొడుకు ముందే ప్రియుడితో రాసలీలలు:
రెండు రోజుల క్రితం.. ప్రియుడిని కలిసేందుకు కొడుకుని తీసుకుని సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లింది దీప. అక్కడ ప్రియుడు సొరిముత్తు నాలుగేళ్ల లోకేష్‌ని చెంపమీద కొట్టి లాడ్జి గది బయటే నిలబెట్టాడు. కొడుకు ఏడుస్తూ బయట నిలబడినా తల్లి లోపలికి వెళ్లి ప్రియుడితో రాసలీలలు సాగించింది. కొడుకు ముందే పరాయి వ్యక్తితో పడక సుఖం పంచుకుంది. అదే సమయంలో దీప భర్త ప్రకాష్ ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య, కొడుకు కనిపించపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. తాను పనికి వెళ్లాక భార్య ఎవరితోనే సంబంధం నెరుపుతోందని సందేహించాడు. వెంటనే ఫోన్ తీసి భార్య దీపకి వీడియో కాల్ చేశాడు. ఎంతకీ భార్య ఫోన్ తీయకపోవడంతో అతని అనుమానాలు బలపడ్డాయి.

చిన్నారిని చావబాదిన తల్లి ప్రియుడు:
ఈ క్రమంలో ప్రియుడితో రాసలీలలు సాగించేందుకు ఫిబ్రవరి 21న లాడ్జి గదిలోకి వెళ్తూ తన ఫోన్‌ని కొడుకు లోకేష్‌కి ఇచ్చి వెళ్లింది దీప. అదే సమయంలో తండ్రి ప్రకాష్ ఫోన్ చేయడంతో లోకేష్ ఫోన్ మాట్లాడాడు. వీడియోలో చిత్రాలు చూసిన ప్రకాష్.. కొడుకుని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. తనను లాడ్జి గది బయట నిలబెట్టి తల్లి ఎవరితోనో లోపల ఉందని చెప్పేశాడు కొడుకు. అలాగే ఆమె ప్రియుడు తనను కొట్టాడని ఏడుస్తూ చెప్పడంతో ప్రకాష్ అనుమానాలు నిజమయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బాబు మృతి:
తమ ఇద్దరి వివాహేతర సంబంధం వ్యవహారం ప్రకాష్‌కి లోకేష్ చెప్పిన విషయం దీప, సొరిముత్తుకి తెలిసిపోయింది. అంతే... కోపంగా వచ్చిన ముత్తు... పిల్లాడిని విచక్షణారహితంగా చావబాది పారిపోయాడు. ఆ దెబ్బలకు లోకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం(ఫిబ్రవరి 23,2020) మరణించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. దీపను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సొరిముత్తు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే... తన సుఖం కోసం దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనం రేపింది. తనే కొడుకుని చంపుకుంది. భర్తను మోసం చేయడమే కాకుండా అభంశుభం తెలియని కొడుకు చావుకి కారణమైన దీపను కఠినంగా శిక్షించాలని భర్త ప్రకాశ్, అతడి బంధువులు డిమాండ్ చేశారు.

Madurai
tamilnadu
POLLACHI
Coimbatore
4-year-old boy
mothers affair
death
Paramour
lover
illegal affair
Extra marital affair
deepa
sorimuthu

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు