అప్లై చేసుకోండి: ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో MBA కోర్సులు

Submitted on 26 November 2019
IMU CET 2020 Application Form Release

ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ (IMU)లో MBA, DNS డిప్లామా కోర్సుల్లో 2020 సంవత్సరానికి గాను అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ యూనివర్శిటీ ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. కొచ్చి, కోలకత్తా, విశాఖపట్నం, ముంబై పోర్టులలో క్యాంపస్ లు ఉన్నాయి. ఇందుకు ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్ధులకు రూ.1000 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులకు మాత్రం రూ.700 చెల్లిస్తే సరిపోతుంది. డిసెంబర్ 10లోగా ఫీజు చెల్లించాలి.

విద్యార్హత :
విభాగాల వారీగా ఇంటర్, డిగ్రీ, BE, B-Tech పాస్ కావాల్సి ఉంటుంది. 

ముఖ్యతేదిలు:
దరఖాస్తు ప్రారంభ తేది : నవంబర్ 15, 2019.
దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 13, 2019
పరీక్ష తేది : జనవరి 4 , 2020.
పరీక్ష ఫలితాలు వెల్లడి: జనవరి 10, 2020.

IMU CET
2020
Application Form
release

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు