కరోనా వైరస్ కలర్ ఫొటోలు చూశారా.. అందుకే ఆ పేరు పెట్టారు

Submitted on 15 February 2020
Images of new coronavirus just released

అమెరికాలోని Rocky Mountain Laboratories (RML) చైనాను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్( SARS-CoV-2) ఫొటోలను విడుదల చేసింది. 60వేలకు మందిని పైగా బాధకు గురిచేస్తున్న కరోనా.. వెయ్యి 370మందిని పొట్టన బెట్టుకుంది. శరీరంలో ఉండే ప్రొటీన్‌లలో చేరి డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలతో ఇన్‌ఫెక్షన్‌ను పెంచుకుంటుంది. 

మైక్రోస్కోప్‌లో చూసేందుకు పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నట్లు అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. COVID-19 (కరోనా)కు గురైన పేషెంట్ నుంచి సేకరించిన శాంపుల్‌తో నమూనాల ఫొటో తీశారు. రెండు రకాల హై రిసొల్యూషన్ మైక్రోస్కోప్‌(స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్)లతో వీటి ఫొటోలను తీయగలిగారు. 

ఫొటోలను తీసి అది స్పష్టంగా కనిపించేందుకు వాటికి కలర్ జోడించారు. SARS-COV-2 వైరస్ చూడటానికి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ 2012లోనే కనుగొన్న (MERS-CoV)ను పోలి ఉంది.  SARS-COV-2 2002లోనే బయటపడింది. 

దీనిని బట్టే  మూడు ఒకే రకమైనవిగా పరిగణిస్తున్నారు. అందుకే వీటికి కరోనావైరస్ పేర్లనే పెట్టారు. మైక్రోస్కోపులో చూసినప్పుడు అవి కిరీటంలా కనిపిస్తున్నాయట. లాటిన్ భాషల్ కిరీటాన్ని కరోనా అని పిలుస్తారు అందుకే ఆ పేరు పెట్టారు. 

corona virus color photos

 

corona virus color photos

 

corona virus color photos

 

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!   

coronavirus
corona virus
New Coronavirus
coronavirus photos

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు