ఐఐటీ స్టూడెంట్స్ ఘనత: హోం-రీచార్జ్‌బుల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్

Submitted on 16 September 2019
IIT Kharagpur Students Build A Home-Rechargeable Electric Three-Wheeler

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్ (IIT KGP) విద్యార్థులు కొత్త రికార్డు సృష్టించారు. హోం రీచార్జ్‌బుల్ త్రీ వీలర్ వెహికల్ రూపొందించారు. మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ విక్రాంత్ రాచెర్ల నేతృత్వంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వెహికల్ తయారు చేశారు. సిటీలో ట్రాన్స్ ఫోర్టేషన్ కోసం దెస్లా అనే పేరుతో ఎలక్ట్రానిక్ త్రీ వీలర్ రూపొందించారు.

ఈ వాహనాన్ని ఇంట్లోనే ఈజీగా రీచార్జ్ చేసుకోవచ్చు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రాచెర్ల చెప్పిన ప్రకారం.. ‘ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు చక్రాల వాహనాల్లో కంటే ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గుంతలున్న రోడ్లపై కూడా ఎలాంటి కుదుపులు లేకుండా స్థిరంగా వెళ్లగలదు’ అని అన్నారు. హై మెకానికల్ అడ్వాంటేజ్ తో గేర్ మెకానిజం పనిచేస్తుంది. 

స్టీరింగ్ వీల్ ఈజీగా ఆపరేట్ చేసుకునేలా ఉంది. బ్రేక్ విషయానికి వస్తే.. మెకానికల్ బ్రేకుల కంటే ఎంతో ఎఫెక్టీవ్ గా ఉంటాయి. ఇందులో హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. రెండు వేరియంట్లకు చెందిన త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు రాచెర్ల తెలిపారు. అందులో ఒకటి మూడు సీట్లు, రెండోది మూడు సీట్ల వరకు కెపాసిటీ ఉంటుంది. పవర్ ఫుల్ మోటార్ లో లిథియం ఐయాన్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఏడేళ్ల వరకు బ్యాటరీ మన్నిక ఉంటుంది. అధిక బరువును కూడా మోయగల కెపాసిటీ ఉంది. అవసరమైన రీతిలో ప్రేమ్ మార్చుకునేలా దెస్లా డిజైన్ చేశారు. డీజిల్ ఇంజిన్ వాహనాల కంటే దెస్తా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంధన ఆటోలతో పొల్యుషన్ ప్రభావం ఉంటుంది. 

వీటి వాహన నిర్వాహణ భారం ఎక్కువగా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వాహనం అయితే.. సౌకర్యవంతంగానూ సురక్షితగానూ పనితీరు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని ఐఐటీ ఖరగ్ పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రొఫెసర్ రాచెర్ల, ఆయన విద్యార్థుల బృందం ఈ వెహికల్ ప్రొడక్షన్ కోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెబుతోంది. కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు నిధులు కోరుతోంది. అధికారిక ఆటోమాటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. విద్యార్థుల బృందం ఇప్పటికే ఎలక్ట్రానిక్ త్రీ వీలర్ ప్రొడక్షన్ కోసం.. స్టార్టప్ కంపెనీగా రిజిస్టర్ చేయించుకున్నట్టు రిపోర్టు తెలిపింది. ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్టార్టప్ కంపెనీగా Smart E ఆపరేట్ చేస్తోంది. 

ఇటీవలే సిరీస్ B వెహికల్స్ పై జపానీస్ కంగోలిమిరేట్ మిట్ షుయ్ అండ్ కోం నుంచి రూ.100 కోట్ల వరకు ఫండ్స్ పొందింది. ఈ కంపెనీ ఢిల్లీ NCRలో 800కు పైగా EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. మరో ఆరు EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. Smart E ఎలక్ట్రిక్ వెహికల్స్ కు Deshla EV త్రీ వీలర్ వెహికల్ కు ఉండే ఒకటే వ్యత్యాసం.. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోనే అవకాశం ఉండటం. ఇలా చేయడం ద్వారా కంపెనీ కూడా ఛార్జింగ్ స్టేషన్ల ఖర్చు ఉండదు. ఎలక్ట్రిక్ త్రి వీలర్ సిగ్మంట్లను అందించే కంపెనీల్లో ఉబర్ ఒకటి. సన్ మొబిలిటీ భాగస్వామ్యంలో తమ ప్లాట్ ఫాంపై ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టింది. 

IIT Kharagpur
IIT Students
Home-Rechargeable
Electric Three-Wheeler
IIT KGP

మరిన్ని వార్తలు