కంగ్రాట్స్ : విజయవాడ స్టూడెంట్‌కు ICAI ఫస్ట్ ర్యాంకు

Submitted on 17 January 2020
ICAI CA Final Result 2019 Vijayawada Student First Rank

సీఏ ఫైనల్స్ ఫలితాల్లో విజయవాడ స్టూడెంట్ జి.కృష్ణప్రణీత్ అదరగొట్టాడు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో స్టూడెంట్ వి.ఆంజనేయ వరప్రసాద్ జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించడం విశేషం. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొదటిసారే ర్యాంకులు సాధించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) 2020, జనవరి 16వ తేదీ గురువారం ఫలితాలు ప్రకటించింది. ఈ సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్ తుమ్మల రామ్మోహన్ రావు కార్యాలయంలో కృష్ణ ప్రణీత్, వి.ఆంజనేయ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 


పరీక్ష రాసిన రోజున మంచి మార్కులు వస్తాయని అనుకున్నట్లు, కానీ..ఐసీఏఐ వాళ్లు ఫోన్ చేసి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని చెప్పారని కృష్ణ ప్రణీత్ చెప్పాడు. ఇంత గొప్ప ర్యాంకు రావడానికి కారకులు తన తల్లిదండ్రులని, వారి ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందన్నారు. తొలి ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని, మంచి శిక్షణనిచ్చి అన్ని రకాలుగా ప్రోత్సాహించిన సీఏ టి.రామ్మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఆలిండియా 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని మరో విజేత ఆంజనేయ వరప్రసాద్ తెలిపాడు. 

Read More : స్పేస్ టెక్నాలజీ : ఆకాశం నుంచి నిఘా

ICAI
ca
Final Result
vijayawada
student
First Rank

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు