టార్గెట్ స్టూడెంట్స్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

Submitted on 21 February 2019
Hyderabd Police Arrest Drugs Supplier

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. స్టూడెంట్స్‌ని టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఘనా దేశస్తురాలిగా గుర్తించారు. ఆమె నుంచి 50గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, నగరంలో ఏయే ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందాను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా గుట్టుగా సాగిపోతోంది. పోలీసుల కళ్లు గప్పి మాదకద్రవ్యాలను నగరంలోకి తరలిస్తున్నారు. వాటిని కాలేజీ స్టూడెంట్స్‌కు సప్లయ్ చేస్తున్నారు. సంపన్నుల పిల్లలను కూడా టార్గెట్ చేస్తున్నారు. వారిని మాదకద్రవ్యాలకు బానిసలు చేసి బిజినెస్ చేసుకుంటున్నారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలు డ్రగ్స్‌ బానిసలుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమంది డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్నా, నిఘాను పెంచినా డ్రగ్స్ ముఠాలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాయి.

Hyderabad
Drugs
police arrest women
cocaine
ghana women
college students
hyderabad police
drugs gang busted

మరిన్ని వార్తలు