స్పెషల్ శుభలేఖ: అతిథులారా.. మోడీకి ఓటు వేయండి  

Submitted on 11 February 2019
Hyderabad youth wedding card asks guests to vote for Modi

పెళ్లికి అతిథులకు వెడ్డింగ్ కార్డులతో ఆహ్వానం పలికడం వెరీ కామన్. పెళ్లి కార్యక్రమాల్లో వచ్చే బంధువులకు వెరైటీ ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తుంటారు. స్పెషల్ ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేసి అందరిని సర్ ప్రైజ్ చేస్తుంటారు. అందరిలా కాకుండా హైదరాబాద్ కు చెందిన కుర్రాడు సరికొత్తగా ఆలోచించాడు. శంషాబాద్ కు చెందిన ముకేశ్ రాం యండే (27) ఫిబ్రవరి 27న శంషాబాద్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. సాధారణంగా వెడ్డింగ్ కార్డులో బంధువుల పేర్లు అచ్చు వేయిస్తారు. అందుకు భిన్నంగా మోడీకి ఓటు వేయండి అంటూ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేయించాడు.


ఒకవైపు తన పెళ్లి దగ్గరపడుతోంది. మరోవైపు లోక్ సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఇతగాడికి ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో అభిమానం. మోడీపై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా తన వెడ్డింగ్ కార్డుపైనే ప్రధాని పేరుతో పాటు కమలం గుర్తులను అచ్చు వేయించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 


అంతేకాదు.. తన పెళ్లికి వచ్చే అతిథులంతా గిఫ్ట్ లు తీసుకరావద్దని.. ఓటు వేస్తే చాలంటున్నాడు. అదే తన పెళ్లికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అంటున్నాడు. అయితే ముఖేశ్ ఆలోచనను తొలుత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారట. చివరికీ వారిని కూడా  ఇతగాడు కన్విన్స్ చేశాడు. నరేంద్ర మోడీ పనితీరు ఎంతో నచ్చిందని, అందుకే మోడీకి సపోర్ట్ గా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అందరిని ఓటు వేయాలని కోరుతున్నట్టు చెప్పుకొచ్చాడు.


ముఖేశ్ టీఎస్ జెన్ కో కంపెనీలో అసిస్టెంట్ ఇంజినీర్. ఈ నెల 27న శంషాబాద్ లో వివాహం చేసుకోబోతున్నాడు. తన వివాహానికి హాజరయ్యే స్నేహితులు, బంధువులకు వెడ్డింగ్ కార్డు ఇచ్చి మోడీకి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరాడు. లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలలో జరుగునున్న సంగతి తెలిసిందే. 

ఇటవల గుజరాత్ కు చెందిన కొత్త జంట కూడా తమ పెళ్లి వెడ్డింగ్ కార్డుపై మోడీ పేరును అచ్చు వేయించారు. లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని గెలిపించాలని అతిథులకు ఇచ్చిన వెడ్డింగ్ కార్డుల్లో కోరారు. 2019 ఎన్నికల్లో మోడీకి ఓటు వేయండి చాలు. అదే మీరు తమకు ఇచ్చే గొప్ప గిఫ్ట్.. అని ఫ్రింట్ వేయించారు. ఈ కార్డును ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Hyderabadi youth
Wedding Card
guests
Narendra modi     

మరిన్ని వార్తలు