హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్

Submitted on 16 April 2019
Hyderabad Woman gang-raped in Vanasthalipuram

హైదరాబాద్ సిటీలో దారుణం జరిగింది. వనస్థలిపురంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆరుగురు యువకులు కలిసి చేసిన ఈ ఘోరంపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ గ్యాంగ్ రేప్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also : రైలు కిందపడి లవర్స్ సూసైడ్

హైదరాబాద్ సిటీ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రాంతంలో ఓ యువకుడు సీసీ కెమెరా బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం అయ్యింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. శనివారం రాత్రి పార్టీ ఉంది రమ్మని ఆహ్వానించాడు. మొదట ససేమిరా అన్న ఆ యువతి.. బలవంతం చేయటంతో కాదనలేకపోయింది. నా ఇంట్లోనే పార్టీ అని.. ప్రత్యేకంగా నీ కోసమే అని.. మనం ఇద్దరమే అని చెప్పాడు. దీంతో నమ్మి వెళ్లింది ఆ యువతి. స్నేహితుడి పార్టీకి వెళ్లిన ఆ యువతితో బాగా మందు కొట్టించాడు ఆ స్నేహితుడు. దీంతో ఆమె మత్తులోకి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఆ యువకుడు తన స్నేహితులను పిలిచాడు. ఇంటికి వచ్చిన వారు.. ఆ యువతిపై అత్యాచారం చేశారు. కిరాతకంగా వ్యవహరించారు. బలవంతంగా అత్యాచారం చేశారు. ఎంత గింజుకున్నా లాభం లేకుండా పోయింది. తప్పించుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. ఆ రాత్రంతా దారుణంగా బాధను అనుభవించిన ఆ యువతి.. ఏప్రిల్ 14వ ఆదివారం ఉదయం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. విషయం తెలిసిన యువకులు పరారీలో ఉన్నారు. గాలింపు చేస్తున్నారు పోలీసులు.
Read Also : తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం

Hyderabad
Woman
gang-rape
Vanasthalipuram


మరిన్ని వార్తలు