హైదరాబాద్ : మరో 5 స్టేషన్లకు MMTS సర్వీసులు

Submitted on 12 February 2019
Hyderabad: MMTS trains for five more stations

హైదరాబాద్: నగర పరిధిలో సేవలందింస్తున్న MMTS  రైళ్లు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవల్ని అందిస్తున్నాయి. రోజు వేలాదిమంది ప్రయాణీకులు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో నగర పరిధిలోని సనత్ నగర్ టు మౌలాలి స్టేషన్ల మధ్య మరో ఐదు స్టేషన్లు రూపుదిద్దుకుంటున్నాయి. సనత్ నగర్ - మౌలాలీ సెక్షన్ 22 కిలోమీటర్ల విస్తరణలో భాగంగా ఫిరోజ్ గూడా, సుచిత్రా సెంటర్, భుదేవి నగర్, నెరెమెట్ మరియు మౌలాలీ HB కాలనీలలో ఐదు MMTS స్టేషన్లు నిర్మించబడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశ మార్గాల్ని మార్చి, ఏప్రిల్‌ కల్లా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వేబోర్డు అధికారులు తెలిపారు. 

 

నగరంలోని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న MMTS ప్రాజెక్ట్ యొక్క దశ II లో జరుగుతున్న క్రమంలో ఎస్.సి.ఆర్ అధికారుల ప్రకారం..గత రెండు సంవత్సరాల క్రితం రూ. 20 కోట్ల వ్యయంతో ప్రయాణీకుల సదుపాయాల కింద చేపట్టింది.ఇప్పటికే ఫలాక్ నుమా విభాగంలో పనులు కొనసాగుతుండగా..తల్లాపూర్-రామచంద్రపురం, మౌలా అలీ-ఘాట్ కేసర్, మెడ్చల్-బోల్లారం స్టేషన్లలో లలో 70 శాతం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ ఖర్చుల అంచనా రూ. 816 కోట్లు కాగా..అందులో రైల్వే వాటా 272 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 544 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు.

 

Telangana
Hyderabad
MMTC
Sanath Nagar
Mauli

మరిన్ని వార్తలు