హైదరాబాద్‌ను తాకిన పౌరసత్వ నిరసనలు : MANNU విద్యార్థుల ఆందోళన

Submitted on 16 December 2019
Hyderabad MANUU students Protest Citizenship Bill

పౌరసత్వ నిరసనలు హైదరాబాద్‌నూ తాకాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (MANNU)లో ఆందోళనలు జరిగాయి.  2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 'మను' విద్యార్థులు పెద్దఎత్తున వర్సిటీ ప్రధాన ద్వారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని ఖండించారు. డప్పులు వాయిస్తూ ఆందోళనను కొనసాగించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. 

మరోవైపు ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 60మంది గాయపడ్డారు. అనుమతి లేకుండానే పోలీసులు జామియా వర్సిటీలోకి ప్రవేశించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 50 నుంచి 100 మంది దాకా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగానే నిరసన తెలిపినట్టు స్పష్టం చేశారు. వర్సిటీ ప్రాంగణంలోకి  పోలీసులు అనుమతి లేకుండా, బలవంతంగా ప్రవేశించారని ఆరోపించారు. విద్యార్థులను, లెక్చరర్లను కొట్టి క్యాంపస్‌ నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారని తెలిపారు. పోలీస్‌ చర్యను వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ నజ్మా అఖ్తర్‌ ఖండించారు. 
Read More : న్యాయం జరిగేనా : సమత అత్యాచారం, హత్య కేసు విచారణ

Hyderabad
MANUU
Students
Protest
Citizenship Bill

మరిన్ని వార్తలు