జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ

Submitted on 9 February 2019
Hyderabad Girl struggles to face Visa fraud case after stuck in US

అమెరికా వెళ్లాలనే లక్ష్యం నెరవేరింది. వీసాతో ఫ్లయిట్ ఎక్కింది. అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది. ఇది జరిగింది 2015లో. ఫర్మింగ్ టన్ వర్సిటీలో చదువుతోంది. అది ఫేక్ అని తేలింది. పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత కాలికి చిప్ పెట్టారు. జీపీఎస్ ట్రాకర్ తో ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి. అలా అని ఇండియా రాలేని పరిస్థితి. అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాద్ అమ్మాయి దీనగాధ ఇప్పుడు తెలుసుకుందాం..
 

అమెరికాలో ఇప్పుడు ఇలా ఉంది :
అమెరికా వెళ్లాలనేది ఆమె బ్రిగ్ డ్రీమ్. 2015లో నార్త్ వెస్టరన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (NPU) లో చేరింది. అక్కడి నుంచి మాస్టర్ ప్రొగ్రామ్ కోసం యూనివర్శిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ కు వెళ్లింది. తొలుత కొంత ఇబ్బందిగా అనిపించినా కొన్నాళ్లుకు అంతా సర్దుకుంది. చదువు సాఫీగా సాగిపోయింది. అంతా మంచిగా ఉందనుకున్న తరుణంలో తన జీవితం తల్లకిందలైపోయింది. ఆ రోజు జనవరి 30. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆమె ఇంటి డోర్ కొట్టారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అమ్మాయిని నిద్రలేపారు. అనంతరం అధికారులు ఆమెను వారి ఆఫీసుకు తీసుకెళ్లారు. రాత్రి 8.30 గంటల వరకు విచారించారు. అక్కడే ఆమె కాలికి రేడియో ట్యాగ్ అమర్చారు. కాలిఫోర్నియా విడిచి పోవద్దని సూచించారు. ప్రతి గురువారం ఆఫీసు కు వచ్చి వెళ్లాలన్నారు. ప్రస్తుతం ఉండే పోస్టల్ అడ్రస్ మారొద్దన్నారు. తిరిగి ఇండియా వెళ్లొద్దని అధికారులు చెప్పారని పట్టరాని దు:ఖంతో.. ఆమె ఓ జాతీయ మీడియాతో యూఎస్ నుంచి ఫోన్ లో చెప్పిన దీనగాధ. 
 

న్యాయం కోసం ఎదురుచూపులు.. 
పేయింగ్ గెస్ట్ గా నాలుగు గోడల మధ్య ఉండిపోవాల్సిన పరిస్థితి. మార్చి 14 కోసం ఎదురుచూస్తోంది. కోర్టులో అయిన తనకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అప్పడైన తనకు జీపీఎస్ ట్రాకర్ ను విముక్తి కలుగుతుందని 25ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి భావిస్తోంది. అప్పటివరకూ నాలుగు గోడల మధ్యనే ఉండాలి. ఆమె దగ్గర చిన్నమొత్తంలో మాత్రమే డబ్బు ఉంది. మూడు పూటలు తినడం కూడా ఎంతో కష్టంగా మారింది. అక్కడి ఓ ఫ్యామిలీ అందించే చాలీచాలని కూరగాయాలు, రైస్ తోనే పొట్టనింపుకోవాల్సిన దీనస్థితికి చేరుకుంది. 
 

రూ.20 లక్షలు అప్పు చేసి వెళ్లా :
అమెరికా వెళ్లి చదువుకోవాలన్న డ్రీమ్ నెరవేరిందనే సంతోషం కొన్నాళ్లకే ఆవిరైంది. అమెరికా ప్రయాణానికి తన తండ్రి లక్షల రూపాయల అప్పు తెచ్చాడని చెప్పుకొచ్చింది. మా నాన్న లెక్చరర్. నా అమెరికా చదువు కోసం నాన్న రూ.20 లక్షలు అప్పు చేశాడు. ఫర్మింగ్ టన్ (NPU) యూనివర్శిటీలో చదువుతూ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ఎంచుకున్నాను. మూడు నెలల క్రితం (కర్క్యూలర్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ద్వారా ఓ జాబ్ కూడా సంపాదించాను. నెలకు జీతం 4వేల డాలర్లు. జాబ్ చేయడం కష్టంగా ఉండేది. దురదృష్టవశాత్తూ ఆ కంపెనీ ఒక నెల జీతం ఇవ్వలేదు. నా అమెరికా చదువుకు తెచ్చిన లోన్ లో 5శాతం కూడా చెల్లించలేని పరిస్థితి నాది’’ అని వాపోయింది. 
 

యూఎస్ ఆధారిత ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. అమెరికాలో ఉండి వీసా ఫ్రాడ్ కేసు పై పోరాడేందుకు హైదరాబాద్ అమ్మాయికి మరోదారి లేదు. ఎందుకంటే.. తన తరపున వాదించేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదికి ఫీజు చెల్లించలేదు. ఒకవేళ ఎవరైనా తన కేసును టేకప్ చేసిన కనీసం 1 వెయ్యి డాలరు నుంచి 2వేల డాలర్లు వరకు ఛార్జ్ చేస్తారు. కోర్టుకు వెళ్లిన ప్రతిసారి సదరు లాయర్ కు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె తండ్రి 20 లక్షల అప్పు తెచ్చారు. మళ్లీ అప్పు తెచ్చే పరిస్థితి వారి కుటుంబానికి లేదు’’ అని అన్నారు.  

 

ఇటీవల అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు లో ఆరుగురు తెలుగు విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారమే ఆ ఆరుగురు విద్యార్థులకు బెయిల్ మంజూరు కాగా.. కాలిఫోర్నియా డిటెన్షన్ సెంటర్ నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో భారత విద్యార్థులు ఏపీ, తెలంగాణ నుంచి ఎనిమిది రిక్రూటర్లు తరపున వాదించేందుకు లాయర్ల బృందం ముందుకొచ్చింది.


Read Also:  ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్‌పై విచారణ

Read Also: అమెరికాలో నిర్బంధం : హైదరాబాద్ కు చేరిన 30 మంది విద్యార్థులు

Read Also: షాక్ లో స్టూడెంట్స్ : అమెరికాలో మరో 5 ఫేక్ యూనివర్సిటీలు!

Read Also: అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు 

FAKE UNIVERSITY
US
Visa fraud case
GPS Tracker
Indian Student
Hyderabad girl 

మరిన్ని వార్తలు