మరో దారుణం : తాళ్లతో కట్టేసి భార్యపై భర్త అత్యాచారం

Submitted on 3 December 2019
husband rapes wife with brother

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో భర్త. భార్యను తాళ్లతో కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. నవంబర్ 29న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కదిరి పట్టణంలోని సోమేష్ నగర్ లో ఈ ఘోరం జరిగింది. భర్త మల్లేష్ ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 29న ఫుల్లుగా మందు తాగొచ్చిన మల్లేష్.. కుమార్ తో కలిసి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మల్లేష్ పై ఇదివరకే రేప్ కేసు ఉంది.

కాగా, కేసు పెట్టినందుకు మల్లేష్ తనను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే ఇంతటి ఘోరానికి తెగబడటం దారుణం అంటున్నారు. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు బయటే కాదు ఇంట్లోనే రక్షణ కరువైంది. అండగా నిలవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోంది.

Anantapuram
husband
wife
Rape
friend
Kadiri

మరిన్ని వార్తలు