ప్రపంచంలో ఫస్ట్ టైమ్ : భర్త స్నానం చెయ్యడం లేదని విడాకులు

Submitted on 14 April 2019
Husband doesnt shave, bath.. woman files for divorce

సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహిళతో సన్నితంగా ఉంటున్నాడనో, టార్చర్ పెడుతున్నాడనో.. భార్య కోర్టు గడప ఎక్కడం సహజం, విడాకులు తీసుకోవడం కామన్. అందులో ఎలాంటి తప్పు లేదు. విడాకులకు ఈ రీజన్స్ సరిపోతాయి. కానీ స్నానం చెయ్యడం లేదు అనే కారణంతో విడాకులు కోరితే.. షాక్ అయ్యారు కదూ.. ఇది నిజం. భర్త స్నానం చెయ్యడం, గడ్డం గీసుకోవడం లేదని ఓ భార్య విడాకులు అడిగింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 2018లో వివాహం చేసుకున్న ఓ జంట.. విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లైన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లయ్ చేసుకున్నారు. 6 నెలల పాటు విడిగా ఉండండి.. ఆ తర్వాత విడాకులు మంజూరు చేస్తామని భోపాల్‌ ఫ్యామిలీ కోర్టు తెలిపింది. ఇంతకీ విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. తన భర్త రోజుల తరబడి స్నానం చేయడం లేదని, షేవింగ్ చేసుకోడని ఆమె తెలిపింది. శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడని తెలిపింది. అలాంటి వ్యక్తితో తాను ఉండలేనని అందుకే విడాకులు ఇవ్వండి అని కోరింది. ఆమె చెప్పిన రీజన్ విని న్యాయమూర్తి షాక్ అయ్యారు. నోట మాట రాక సైలెంట్ అయిపోయారు. భర్న స్నానం చెయ్యడం లేదని విడాకులు కోరిన న్యూస్ వైరల్ గా మారింది. దీన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారు. టూ మచ్ కామెడీ అంటున్నారు. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి రీజన్ తో డివోర్స్ అడగటం చూస్తున్నామని అంటున్నారు.

ఈ మధ్య విడాకులు అడగడానికి కారణాలు చూస్తుంటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. అడిగింది కొనివ్వడం లేదని, బయటకు తీసుకెళ్లడం లేదని.. ఇలా చిన్న కారణాలతో వ్యవహారం విడాకుల వరకు వెళ్తోంది. ఆన్‌లైన్‌ లో ఆర్డర్‌ చేసినంత ఈజీగా విడాకులు కావాలని అడిగేస్తున్నారు.

husband
doesnt shave
Bath
Madhya Pradesh
Woman
FILES
divorce
bhopal

మరిన్ని వార్తలు