భ్రమకీ, నిజానికీ తేడా ఏంటి?

Submitted on 13 February 2019
Hulchul Movie TEASER -10TV

బొమ్మరిల్లు, సోలో, యువత లాంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రుద్రాక్ష్, హీరోగా పరిచయం అవుతున్నాడు.. రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా, ప్రత్యూష కొల్లూరి సమర్పణలో, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై, గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న సినిమా.. హల్ చల్.. శ్రీపతి కర్రి డైరెక్ట్ చేస్తున్నాడు.. సినిమాలో కంటెంట్ ఉంటే, ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా సరే, ఆడియన్స్ హిట్ చేసి తీరతారు అని.. ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ప్రూవ్ చేసాయి. కంటెంటే హైలెట్‌గా రూపొందిన హల్ చల్ టీజర్‌.. మొన్నామధ్య రిలీజ్ చెయ్యగా, మంచి రెస్పాన్స్ వస్తుంది.

తెలియక పొరపాటున హల్ చల్ అనే డ్రింక్ తాగిన తర్వాత.. హీరో జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. అతను భ్రమకీ, నిజానికీ తేడా తెలుసుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందిన హల్ చల్.. త్వరలో రిలీజ్ కానుంది.. రవిప్రకాష్, కృష్ణుడు, మధు, జెమినీ సురేష్, ప్రీతినిగమ్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : హనుమాన్ సీ.హెచ్, బ్యాగ్రౌండ్ స్కోర్ : భరత్ మధు సూదనన్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

వాచ్ హల్ చల్ టీజర్...
 

Hulchul
Rudhraksh Utkam
Dhanya Balakrishna
Ganesh Kolluri
Sripathy Karri

మరిన్ని వార్తలు