ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది...ఎన్ని చోట్ల రద్దైంది

Submitted on 24 January 2020
How many states have the Legislative Council in india

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి రద్దు దిశగా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందనే వెతుకులాట ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో శాసనమండలి వ్యవస్థ ఉంది. గత ఏడాది ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌‌లో ఉన్న అసెంబ్లీతో పాటు..కౌన్సిల్ కూడా రద్దైపోయింది. 

గతంలో అస్సోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఉండేది. ఈ రాష్ట్రాల్లో మళ్లీ దాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ ఉంది. ఇక ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ మండలి ఏర్పాటు జరుగలేదు. అయితే.. రాజకీయ అవసరాలను సర్దుబాటు చేసుకోవడానికి మండలిని ఏర్పాటు చేయాలంటూ ఈ రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 

అయితే.. ఏ రాష్ట్రంలోనైనా..శాసనమండలి ఏర్పాటు కావాలన్నా...రద్దు చేయాలన్నా దానికి రాజ్యాంగపరమైన అనుమతి ఆర్టికల్ 169 ప్రకారం అవసరం..అయితే దీనిని రాజ్యాంగసవరణ బిల్లుగా పరిగణించరు. మండలి రద్దు లేదంటే ఏర్పాటు కావాలని కోరుతున్న రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది. అయితే దానికి పార్లమెంట్ ఆమోదం.. ఆ తర్వాత.. రాష్ట్రపతి సంతకం కూడా తప్పనిసరి. 
 

Legislative Council
States
india
AP
Telangana

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు